ఇండియా నుంచి ఆస్కార్‌కు ‘ది గుడ్ రోడ్’

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ ఘోష్, ఇతర జ్యూరీ సబ్యులు దాదాపు 5 గంటల సుధీర్ఘ చర్చల అనంతరం ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసారు. ఈ చిత్రం ఇప్పటికే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. కేవల్ కట్రోడియా, సోనాలి కులకర్ణి, అజయ్ గేహి ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి గ్యాన్ కొర్రెయా అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు.
ఆస్కార్ నామినేషన్ రేసులో బాలీవుడ్ నుంచి ది లంచ్ బాక్స్, భాగ్ మిల్కా భాగ్, ఇంగ్లిష్ వింగ్లిష్, కమల్ హాసన్ నటించిన విశ్వరూపం, తెలుగు నుంచి మిధునం, చదువుకోవాలి, మళయాల చిత్రం సెల్యూలాయిడ్ లాంటి చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే వీటన్నింటికంటే 'ది గుడ్ రోడ్' చిత్రాన్ని బెస్ట్ చిత్రంగా ఆస్కాన్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక చేసారు.


Click it and Unblock the Notifications











