అరెరే...ఆస్కార్ బరి నుంచి మన దేశ చిత్రం ఔట్

వాస్తవానికి ...ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ నుంచి పలు చిత్రాలు 'ఆస్కార్' నామినేషన్ ఎంట్రీకి పోటీ పడగా.....అన్నింటికీ వెనక్కి నెట్టుతూ గుజరాతీ చిత్రం 'ది గుడ్ రోడ్' ఆ అవకాశం దక్కించుకుంది. పోటీలో మొత్తం 22 చిత్రాలు నిలవగా 'ది గుడ్ రోడ్' చిత్రం ఎంపికయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ ఘోష్, ఇతర జ్యూరీ సబ్యులు దాదాపు 5 గంటల సుధీర్ఘ చర్చల అనంతరం ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసారు. ఈ చిత్రం ఇప్పటికే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. కేవల్ కట్రోడియా, సోనాలి కులకర్ణి, అజయ్ గేహి ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి గ్యాన్ కొర్రెయా అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు.
ఇక, నామినేషన్ దక్కించుకున్న ఇతర దేశాల చిత్రాల విషయానికి వస్తే... 'ది బ్రోకెన్ సర్కిల్ బ్రేక్‌డౌన్ (బెల్జియమ్), 'యాన్ ఎపిసోడ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ యాన్ ఐరన్ పికర్' (బోస్నియా మరియు హెర్‌జెగోవినా), 'ది మిస్సింగ్ పిక్చర్' (కంబోడియా), 'ది హంట్' (డెన్‌మార్క్), 'టూ లైవ్స్' (జర్మనీ), 'ది గ్రాండ్‌మాస్టర్' (హంగ్‌కాంగ్), 'ది నోట్‌బుక్' (హంగేరి), 'ది గ్రేట్ బ్యూటీ' (ఇటలీ), 'ఒమర్' (పలెస్టైన్) ఉన్నాయి. ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు.. నామినేషన్ దక్కించుకున్నంత మాత్రాన ఫైనల్స్‌కి వెళతాయనడానికి లేదు. వీటిలో ఓ ఐదు చిత్రాలను ఎంపిక చేసి, ఫైనల్స్‌కి పంపిస్తారు. వచ్చే నెల 16న నామినేషన్ దక్కించుకున్న ఆ ఐదు చిత్రాల వివరాలను ఆస్కార్ కమిటీ ప్రకటిస్తుంది. ఆ ఐదులో ఒక చిత్రాన్ని ఆస్కార్ వరిస్తుంది.
ఆస్కార్ నామినేషన్ రేసులో బాలీవుడ్ నుంచి ది లంచ్ బాక్స్, భాగ్ మిల్కా భాగ్, ఇంగ్లిష్ వింగ్లిష్, కమల్ హాసన్ నటించిన విశ్వరూపం, తెలుగు నుంచి మిధునం, చదువుకోవాలి, మళయాల చిత్రం సెల్యూలాయిడ్ లాంటి చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే వీటన్నింటికంటే 'ది గుడ్ రోడ్' చిత్రాన్ని బెస్ట్ చిత్రంగా ఆస్కాన్ నామినేషన్ ఎంట్రీకి ఎంపిక చేసారు. కానీ ఇప్పుడు అది కూడా బయిటకు వచ్చేసింది.


Click it and Unblock the Notifications











