»   » దటీజ్ బాలయ్య స్టామినా:‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఒక టిక్కెట్‌ రేటు రూ.1,00,100

దటీజ్ బాలయ్య స్టామినా:‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఒక టిక్కెట్‌ రేటు రూ.1,00,100

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఈ రోజు భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం టిక్కెట్‌ ఓ అభిమాని భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశాడు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ఈ సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ అనే అభిమాని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా రూ.1,00,100కు టికెట్‌ కొనుగోలు చేశాడు.

పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ ప్రీమియర్ షో కి బాలకృష్ణ హాజరుకానున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన అభిమానులతో కలిసి సినిమా చూడడం తో అత్యంత ప్రాధ్యాన్యత సంతరించుకుంది ఈ ప్రీమియర్ షో. ఈ థియేటర్‌లోనే దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ ఈ బెనిఫిట్ షో చూస్తున్నారు.


The price of first ticket of Gautamiputra Satakarni benefit show?

ఈ షో కి మొదటి టికెట్ ను రూ.1,00,100 కి గోపిచంద్ యిన్నమూరి అనే అభిమాని దక్కించుకున్నారు. బాలయ్య ఆ అభిమానితో కలిసి సినిమా వీక్షించనున్నారు. ఎప్పుడు సేవ మార్గంలో ఉండే బాలయ్య బాట లోనే బెనిఫిట్ షో నిర్వాహకులు ఈ టికెట్ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి అందచేయనున్నారు. ప్రీమియర్ షో నిర్వాహకులైన మనబాలయ్య.కాం నవీన్ మోపర్తి మొదటి టికెట్ సొంతం చేసుకున్న అభిమానికి నారా రోహిత్ చేతుల మీదుగా టికెట్ ను అందచేశారు.


బాలకృష్ణ మాట్లాడుతూ...తాను నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా ఉంటుందని అన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్రశాతకర్ణి. భరతజాతికి నూతన శకాన్ని ప్రసాదించాడు. రాజసూయ యాగం చేసిన మహా చక్రవర్తి. తెలంగాణలోని కోటిలింగాలలో పుట్టి మెదక్‌లోని కొండాపూర్ మొదలుకొని అమరావతి, ప్రతిష్టానపురం ఇలా దేశం నలుదిశలా తన సామ్రాజాన్యి విస్తరించిన పరాక్రమశీలి.


The price of first ticket of Gautamiputra Satakarni benefit show?

అలాంటి గొప్ప చక్రవర్తి కథతో క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా సినిమా ఉంటుంది. అభిమానులతో కలిసి మొదటి రోజు చూడాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే ఇప్పటివరకూ సినిమాను చూడలేదు. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.


అదేసమయంలో తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యంకాదు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేయాలన్నదే నా అభిమతం. సాంఘికం, జానపదం, పౌరాణికం..ఇలా అభిమానుల అండ వల్లే అన్ని రకాల సినిమాలు చేయగలిగినట్టు బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

English summary
Gopichand Innamuri, a fan of Balakrishna, has bought the first ticket of GautamiPutraSatakarni's benefit show ticket for Rs 1,00,100.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X