»   » ఆ వీడియో చూసి ఎవరూ అపార్థం చేసుకోవద్దు!

ఆ వీడియో చూసి ఎవరూ అపార్థం చేసుకోవద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాన్స్: ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ గత 15 ఏళ్లుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఐష్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. తన తాజా సినిమా 'సరబ్జీత్' చిత్రాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు కూడా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన భర్త అభిషేక్ తో కలిసి పాల్గొన్నారు ఐశ్వర్యరాయ్ .

The real reason why Abhishek walked away from Aishwarya Rai

అయితే ఫోటో సెషన్ జరుగుతుండగా అభిషేక్ తో కలిసి ఫోటో దిగేందుకు ఐశ్వర్యరాయ్ ప్రయత్నించడం... అతడు వచ్చినట్లే వచ్చి, కాస్త కసురుకుంటూ వెళ్లిపోవడం, ఐశ్వర్యరాయ్ పిలిచినా పట్టించుకోకుండా వెళ్లి పోవడం చూసి అంతా షాకయ్యారు. ఎంతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాల్సిన ఇలాంటి పెద్ద వేడుకల్లో అభిషేక్ తన భార్య ఐష్ ను బ్యాడ్ గా ట్రీట్ చేసాడనే విమర్శలు వచ్చాయి.


కాన్స్ లో జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని మరుసటి రోజు బాలీవుడ్ మీడియాలో రకరకాల ప్రచారం మొదలైంది. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, ఐశ్వర్యను బచ్చన్ ఫ్యామిలీ దూరం పెడుతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే అలాంటిదేమీ లేదని బచ్చన్ ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. ఆ వీడియో చూసి ఎవరూ అపార్థం చేసుకోవద్దని అంటున్నారు. 'సరబ్జీత్' ఐశ్వర్యరాయ్ సినిమా అని, ఆ సినిమా క్రెడిట్ అంతా ఆమెకే వచ్చేందుకు అభిషేక్ అలా ప్రవర్తించాడని, ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఫోటో సెషన్లో ఐశ్వర్యకు ప్రధాన్యం ఇచ్చేందుకే కావాలని అతను తప్పుకున్నాడని అంటున్నారు. 'సరబ్జీత్' సినిమా ప్రమోషన్లలో బచ్చన్ ఫ్యామిలీ మొత్తం పాల్గొన్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

English summary
The real reason why Abhishek Bachchan walked away from Aishwarya Rai Bachchan at Sarbjit premiere.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X