»   » మీనా కూతురు కూడా ఎంటరైంది, కథ మొత్తం ఆమెచుట్టే!

మీనా కూతురు కూడా ఎంటరైంది, కథ మొత్తం ఆమెచుట్టే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిన్నటి తరం హీరోయిన్ మీనా తన వారసురాలిని అప్పుడే ఇండస్ట్రీలోకి దించేసింది. తన నాలుగేళ్ల కూతురు నైనికా త్వరలో రిలీజ్ కాబోతున్న'తేరి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేస్తోంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా 'తేరి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నైనికా విజయ్ కూతురుగా నటిస్తోంది.

తన కూతురు వెండి తెరకు పరిచయం అవ్వడంపై మీనా స్పందిస్తూ...'మొదట నన్ను అట్లీ సంప్రదించినపుడు... ఆయన నాకోసం ఏదైనా పాత్రతో వచ్చాడని భావించాను. కానీ అతను నా కూతురును నటింపజేయాలని అడిగారు. అసలు తను అలా అడుగుతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే నైనికా చాలా చిన్నది. నన్ను కథ వినాల్సిందే అని పట్టుబట్టారు, తర్వాత ఒప్పించారు' అని తెలిపారు.

The Story Is Weaved Around Her & She Has 40 Scenes In 'Theri': Meena On Her Daughter Nainika's Role!

'స్టోరీ విన్న తర్వాత సినిమాలో నైనిక క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. స్టోరీ మొత్తం నైనిక చుట్టే తిరుగుతుంది. ఇందులో తను విజయ్ కూతురుగా నటించింది. సినిమాలో దాదాపు 40 సీన్లలో కనిపిస్తుంది. ఎంతో ముఖ్యమైన పాత్ర....తండ్రితో తన రిలేషన్ షిప్ హత్తుకునే లా నైనిక క్యారెక్టర్ ఉంటుంది' అని తెలిపారు.

'తేరి' చిత్రం వివరాల్లోకి వెళితే... విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 14న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Yesteryear actress Meena's four-year-old daughter Nainika, who makes her acting debut in upcoming Tamil actioner Theri, was looked after by the team with care and affection as their own. Directed by Atlee, Theri features Ilayathalapathy Vijay and Nainika plays his daughter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu