»   »  ‘మనం’ మూవీ....తెర వెనక వీరే (వీడియో)

‘మనం’ మూవీ....తెర వెనక వీరే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'మనం' ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్లు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా 'మనం' చిత్రానికి తెరవెనక పని చేసిన టీం గురించి తెలుపుతూ వీడియో విడుదల చేసారు.

The Team Behind Manam

చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌కు యూట్యూబులో మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల్లోనే ట్రైలర్ 4 లక్షల పైచిలుకు హిట్స్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అన్నపూర్ణ స్టూడియాస్‌ పతాకంపై అక్కినేని మూడు తరాల హీరోలైన నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ఇష్క్‌' ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నారు.

ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/712LB1krRgs" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Manam movie starring Late Akkineni Nageshwara Rao, Akkineni Nagarjuna and Akkineni Naga Chaitanya is gearing up for a release on this month 23rd. In the meanwhile, the trailer of the film was launched recently on the official Youtube page of Annapurna Studios and the video has touched a new milestone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu