దేముడు వచ్చాడు : ‘గోపాల గోపాల’ ట్రైలర్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : "కొన్ని సార్లు రావటంలేటు కావచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా" అంటూ పవన్ కళ్యాణ్ ...దేముడులా దిగి వచ్చేసి తమ అభిమానులను ఆనందపరిచేసారు. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న గోపాల గోపాల చిత్రం థియోటర్ ట్రైలర్ విడుదలైంది. వెంకటేష్ తన రెగ్యులర్ ఫన్ కు , పవన్ మ్యాజిక్ ని తోడు చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా మారింది.

'మార్కెట్లోకి కొత్త దేముడు వచ్చి చాలా కాలం అయ్యింది' అంటూ మిధున్ చక్రవర్తి చెప్పే డైలాగు సైతం హైలెట్ గా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ బాస్ గా వెన్నెల కిషోర్, దొంగ స్వామి గా పోసాని, వెంకటేష్ అసెస్టెంట్ గా కృష్ణుడు, దేముడ్ని నమ్మే భక్తురాలు పాత్రలో శ్రియ అంతా బాగున్నారు.

https://www.facebook.com/TeluguFilmibeat

పవన్‌కల్యాణ్‌. దేవునిగా ఆయన కీలక పాత్ర చేసిన చిత్రం ‘గోపాల గోపాల'. వెంకటేశ్‌ ప్రధాన పాత్ర చేసిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకాలపై డి. సురేశ్‌, శరత్‌మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి. రామానాయుడు సమర్పిస్తున్నారు. కిశోర్‌కుమార్‌ పార్దసాని దర్శకుడు.

అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చిన పాటలు లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆదివారం రాత్రి శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌, వెంకటేశ్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

The theatrical trailer of 'Gopala Gopala' has unveiled

పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ దేవుణ్ణి నేను నమ్ముతాను. అయితే నిరాకారుడైన దేవుణ్ణి నమ్ముతాను. అభిమానులు నా మీద చూపించే ప్రేమ, ఆప్యాయతకు భగవంతుడు కరుణించాడు. వెన్నుచూపడం నాకు తెలీదు. నేను సినిమాల్లోకి రాక ముందునుంచీ వెంకటేశ్‌గారితో నాకు అనుబంధం ఉంది. ఎప్పట్నించో ఇద్దరం కలిసి సినిమా చెయ్యాలనుకుంటున్నాం. మేం కలిసినప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. బహుశా ఈ సినిమా చెయ్యడానికి అదే కారణం అనిపిస్తోంది. ఇందులో దేవుడి కేరక్టర్‌ చేశాను. అందుకని ఒళ్లు దగ్గరపెట్టుకొని చేశాను. '' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X