»   »  ఆ హీరోయిన్ గురించి షాకింగ్ విషయాలు: అన్ని కోట్లు ఎలా సంపాదిస్తోంది?

ఆ హీరోయిన్ గురించి షాకింగ్ విషయాలు: అన్ని కోట్లు ఎలా సంపాదిస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఒక హీరోయన్ సంపాదన సంవత్సరానికి ఎంత ఉంటుంది? మన తెలుగులో అయితే సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమా నుండి ఒకటిన్నర నుండి 2 కోట్లు తీసుకుంటున్నారు. సంవత్సరానికి అరడజను సినిమాలు చేస్తే రూ. 10 నుండి 12 కోట్లు సంపాదిస్తారు. కమర్షియల్ యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు లాంటివన్నీ కలిపితే మహా అయితే రూ. 15 నుండి 20 కోట్లు సంపాదిస్తారని అంచనా.

అదే బాలీవుడ్లో అయితే కత్రినా కైఫ్, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్ల సంపాదన సంపాదన రూ. 40 నుండి 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే హాలీవుడ్లో టాప్ హీరోయిన్ల సంపాదన చూస్తే మనలాంటి సాధారణ ప్రేక్షకులు షాకవ్వడం ఖాయం.

తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించిన 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో "హంగర్ గేమ్స్" స్టార్ జెన్నీఫర్ లారెన్స్ నెం.1 స్థానం దక్కించుకుంది. టాప్ ప్లేసులో నిలవడం ఆమెకు ఇది వరుసగా రెండో సారి.

గమనించాల్సిన విషయం ఏమిటంటే... గతేడాది తో పోలిస్తే ఆమె సంపాదన 11.5% తగ్గింది. ఆమె సంపాదనకు సంబంధించిన పూర్తి వివరాలు, అన్ని కోట్లు ఎలా సంపాదించింది? అనే డీటేల్స్ స్లైడ్ షోలో...

జెన్నిఫర్ లారెన్స్

జెన్నిఫర్ లారెన్స్


ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన జాబితా ప్రకారం జెన్నిఫర్ లారెన్స్ ఈ ఏడాది 46 మిలియన్ డాలర్లు సంపాదించింది.

మన కెరెన్సీలో..

మన కెరెన్సీలో..


న ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం చూస్తే ఆమె ఈ ఏడాది రూ. 308 కోట్లకుగా సంపాదించింది.

గతేడాది

గతేడాది


గతేడాది ఫోర్స్ లిస్టు ప్రకార ఆమె సంపాదన 52 మిలియన్ డాలర్లు.

ఎలా సంపాదించింది?

ఎలా సంపాదించింది?


హాలీవుడ్లో తెరకెక్కిన "హంగర్ గేమ్స్" చిత్రంలో జెన్పిఫర్ నటించింది. అందుకే ఇంత భారీ మొత్తంలో ఆమె సంపాదన ఉంది.

అయినా అసంతృప్తే

అయినా అసంతృప్తే


ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా.. ఆమెలో అసంతృప్తే ఉంది. అందుకే కారణం వివక్షే అంటోంది.

వారితో పోల్చితే

వారితో పోల్చితే


హాలీవుడ్ రెమ్యునరేషన్స్ లో లింగ వివక్ష బాగా ఉందని, నటుల కంటే నటీమణులకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అంటోంది.

పర్సనల్ డీటేల్స్

పర్సనల్ డీటేల్స్


జెన్నిఫర్ లారెన్స్ గురించిన వివరాల్లోకి వెళితే... 24 ఏళ్ల జెన్నిఫర్ లారెన్స్ యూఎస్ లోని కెంటకీ రాష్ట్రంలో జన్మించింది.

నటనారంగంలకి

నటనారంగంలకి


పదహారేళ్ల వయసులోనే యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. బుల్లితెరలో ప్రసారం అయ్యే టీబీఎస్ కామెడీ సిరీస్ లో నటించింది. 2008లో గార్డెన్ సిటీ అనే అమెరికన్ చిత్రం ద్వారా వెండితెరంగ్రేటం చేసింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు


హాట్ అండ్ సెక్సీగా ఊరించే అందచందాలు, ఆకట్టుకునే అభినయం ఆమె సొంతం. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెలుతోంది.

భారీ బడ్జెట్ చిత్రాల్లో

భారీ బడ్జెట్ చిత్రాల్లో


హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలైన ఎక్స్‌మెన్- ఫస్ట్ క్లాస్ , ఎక్స్‌మెన్-డేస్ ఆఫ్ ఫ్యూచర్ ఫాస్ట్, ది హంగర్ గేమ్స్ సిరీస్ లోని వరుస చిత్రాలతో పాటు ఇప్పటి వరకు మొత్తం 15పైగా హాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

ఉత్తమ

ఉత్తమ


సిల్వర్ లైనింగ్ ప్లేబుక్స్ అనే చిత్రానకి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది.

హ్యాకర్ల దాడి

హ్యాకర్ల దాడి


ఆ మధ్య ఇంటర్నెట్లో హాకర్ల దాడిలో జెన్నిఫర్ లారెన్స్ కు సంబంధించిన పలు న్యూడ్ ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే.

Read more about: jennifer lawrence
English summary
For the second year in a row, the odds are in her favor: Jennifer Lawrence is once again the world’s highest-paid actress, notching $46 million pretax over 12 months–$13 million more than second-ranked Melissa McCarthy, who pocketed $33 million.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu