twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Theatres In Telangana: విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. కానీ అదే టెన్షన్!

    |

    కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గత కొద్ది రోజుల క్రితం వరకు అన్ని రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలను కూడా భయపెట్టిన కరోనా మహమ్మారి రెండో దశ నెమ్మదించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా చాలా సడలింపులు ఇచ్చారు. తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సడలింపులు మరింత పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    మరీ ముఖ్యంగా తెలంగాణలో 19వ తేదీ వరకు ఈ సడలింపులు కొనసాగనుండగా 20వ తేదీ నుంచి కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే విధిస్తారని రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంటే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే వచ్చే నెల ఒకటో తారీకు నుంచి థియేటర్స్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం అనుమతించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ రావడం లేదు.

    Theatres in Telangana may Operate with 50 Percent Occupancy from July 1st

    తెలంగాణలో కరోనా పాజిటివ్ రేటుతో పాటు రోజు వారీ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. కానీ ఆంధ్ర ప్రదేశ్లో పాజిటివ్ రేట్ తో సహా కేసులు కూడా ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఒకవేళ తెలంగాణలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసినా సరే సినిమాలు వెంటనే రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ వరకు 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చేయడం అనేది కష్టం అనే చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో?

    English summary
    All theatres and multiplexes in telangana may Operate with 50% Occupancy from July 1st in the wake of decreased corona cases.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X