»   » పూరీజగన్నాథ్ ఇంట్లో భారీ దొంగతనం

పూరీజగన్నాథ్ ఇంట్లో భారీ దొంగతనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్‌రూమ్‌లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగలించారు.

దాంతో పూరి జగన్నాథ్ శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలమరాలోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన డిజైన్లు, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ఉన్నట్లు పేర్కొన్నారు.

Theft at director Puri's House

ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్...ఛార్మితో చేస్తున్న జ్యోతిలక్ష్మి చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. రీసెంట్ గా ...ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు. ఆ ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది. జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది.

ఆ ఫస్ట్ లుక్ టీజర్ లో భాస్కరభట్ల రాసిన సాంగ్ ఇలా సాగుతుంది...

‘చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్లం అయిపోయామా... వంటింటి కుందేళ్లలాగా వందేళ్లయినా బ్రతికేద్దామా...ఆడోళ్లం ఆడోళ్లం మనం తోడేళ్లతో ఉంటున్నామా...ప్రాణాలు తోడేస్తూ ఉన్న నోరు మూసుకూర్చుందామా...'

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Gold Jewellery worth Rs 15 lakhs have been robbed from Puri Jagannath's House. Police suspect People who were working in the posh house have stolen them. Currently, Few suspects were taken into custody and some of the valuables have been recovered.
Please Wait while comments are loading...