twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమీ పీకలేని పిరికివాళ్లం, వేధింపులు ఆపండి: వైరల్ అవుతున్న శ్రీరెడ్డి పోస్ట్

    By Bojja Kumar
    |

    సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తాజా పోస్టు చూస్తే తెలుస్తోంది. ఒక ఆడ పిల్ల సమాజంలో ఎన్ని రకాలుగా వేధింపులు ఎదుర్కొంటోందో తన పోస్టులో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసు నుండే వారికి వేధింపులు మొదలవుతున్నాయని ఆమె వెల్లడించారు. చాలా మంది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు.

    7వ తరగతి నుండే మొదలు

    7వ తరగతి నుండే మొదలు

    "నేను ఏడో తరగతి చదువున్నపుడే అతను నా ప్రైవేట్ పార్ట్స్ తాకాడు. పదో తరగతి వరకూ అదే జరిగింది. అప్పుడు అదేంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసినా ఏం చేయాలో తెలీదు. 7వ తరగతి అమ్మాయిని చూసి 30 ఏళ్ల వాడికి మూడ్ వస్తే దాన్ని ఏమనాలి?... అంటూ గర్ల్స్ ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి.

    అన్ని చోట్లా వేధింపులే

    అన్ని చోట్లా వేధింపులే

    నేను పుట్టినప్పుడు నన్ను ఎత్తుకున్న చేతులే నన్ను ఆకాంక్షిస్తే?... ఏం చేసేది? ఇలా లక్షల కోట్ల మంది ఉన్నారు. ఏం పోరాటం చేసేది? బస్ లో, సినిమా థియేటర్ లో, జాతరలో జనసమ్మర్దం ఉన్న అన్ని ప్రాంతాల్లో ఇదే జరుగుతుందని శ్రీరెడ్డి తెలిపారు.

    ఏమీ పీకలేని పిరికి వాళ్లం

    ఏమీ పీకలేని పిరికి వాళ్లం

    ఏదో చేస్తున్నావుగా. ఆల్ ది బెస్ట్. మేము మీకు మద్దతిస్తా... అంటారే తప్ప ఇంకేమీ చేయరు. ఇంట్లో న్యూస్ చానల్ చూసి హమ్మయ్య కనీసం ఈమె నోరు లేపుతోంది అని ఆనందించడం తప్ప ఏమీ పీకలేని పిరికివాళ్లమని శ్రీరెడ్డి అన్నారు.

    ఇప్పటికైనా సెక్సువల్ హరాస్మెంట్ ఆపండి

    ఇంటా, బయట ఎక్కడ కూడా ఒక అమ్మాయికి సెక్యూరిటీ లేకుండా పోయింది. దయచేసి వారిని ఆనందంగా బ్రతకనీయండి. సెక్సువల్ హరాస్మెంట్ ఇప్పటికైనా ఆపండి అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

    English summary
    "A girl's insecurity in words, there is no security to the girl at home also..please let them live happily..stop sexual harrasments..#metoo" Sri Reddy said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X