»   » అది తప్పని భావించటం లేదు: ప్రియమణి

అది తప్పని భావించటం లేదు: ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న ప్రియమణి 'ద్రోణ" సినిమా తర్వాత ప్రతి ఇంటర్య్వూలో బికినీ గురించి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. రీసెంట్ గా..."బికినీ వేయటంలో తప్పు ఉందని నేను ఎప్పుడూ భావించటం లేదు. డైరక్టర్ సిమ్మింగ్ పూల్ లో షూట్ చేయాలని చెప్పినప్పుడు డెనిమ్ లో గానీ,చీర లో గానీ వేయలేం కదా. అప్పటి సిట్యువేషన్ కి తగినట్లు నేను దుస్తులు ధరిస్తాను..ధరించాను" . అంది.

అలాగే...మొదట నేను బికినీ వేయమన్నప్పుడు కాస్త హెసిటేషన్ గానే అనిపించింది. అయితే దర్శకుడు కన్వీన్స్ చేసారు. తషాన్ లో కరీనాకపూర్ ఎలా బికినీ వేసుకుందో అలా చేయమన్నారు. జనం నన్ను బికినీ ఫోజ్ లో చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్లంతా నన్ను వేరే విధమైన పాత్రల్లో చూసారు. అప్పటినుంచీ నేను గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రలే చేస్తున్నాను అంది.

బికినీ ప్రియమణికి అస్పలు సూటవలేదని పలువురు అభిప్రాయపడ్తున్నా ఇప్పటికీ నా బికినీ గురించే అందరూ మాట్లాడుకొంటున్నారంటే బికినీలో నేనెంత అదరగొట్టేశానో అర్థమవుతోంది కదా ...అంటూ తన గొప్పలు తానే చెప్పుకుంటోంది. 'ద్రోణ" సినిమాలో బికినీ ధరించి హాట్ హాట్ గా వార్తల్లోకెక్కేద్దామనుకున్న ప్రియమణికి, ఆ చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా సరే, తన బికినీకి మాత్రం మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకుంటోన్న ప్రియమణి, పద్దతిగా కన్పిస్తే ఎవరు పట్టించుకుంటారు..? అనుకోవడంవల్లే కదా, బికినీ అందాల్ని ఆరబోశావ్...మళ్ళీ ఈ ఎదురు ప్రశ్నలేంటి..? అంటున్నారట. స్క్రిప్టు డిమాండ్ చేస్తే బికినీకి తాను సిద్దమేనని, భవిష్యత్ లో మళ్ళీ బికినీ ధరించే విషయమై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సెలవిచ్చింది ప్రియమణి.

జగపతిబాబు ఈ విషయమై మాట్లాడుతూ ....ప్రియమణి బికినీ వేసిందని నేను పనిగట్టుకుని వెళ్ళి 'ద్రోణ' చిత్రాన్ని చూసాను. అటువంటి వెయ్యి బికినీ సీన్స్ పవర్ ఉన్న సన్నివేశాలు సాధ్యం చిత్రంలో ఉన్నాయి అంటున్నారు. అంతేగాక ద్రోణ చిత్రంలోలాగ చేసి ప్రేక్షకులను రంజింప చేయమని ప్రియమణికి పదే పదే ఎడ్వైజ్ ఇస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

English summary

 Priyamani Said "There's nothing wrong in sporting a bikini. If the director wants to shoot you in a pool, you cannot be wearing denims or a saree — you need to be dressed accordingly to the situation. Initially, I was a little hesitant in doing scenes that required me to sport a bikini. But then, the director convinced me, saying he wanted to shoot me just like how Kareena Kapoor was captured wearing a bikini in Tashan. People were surprised to see me in my bikini avatar, because they got to see a different side to me. Till then, I had played girl-next-door roles" .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X