»   » సినిమా రిలీజ్ మర్నాడే... సైలెంట్ గా బీచ్ లో బోయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసేసుకుంది(ఫొటోలు)

సినిమా రిలీజ్ మర్నాడే... సైలెంట్ గా బీచ్ లో బోయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసేసుకుంది(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఈ సంవత్సరం బాలీవుడ్ హీరోయిన్స్ వివాహ నామ సంవత్సరంగా మిగిలిపోనుందేమో అనిపిస్తోంది. వరస పెట్టి హిందీ చిత్ర సీమలో జరుగుతున్న పెళ్లిళ్లను చూస్తూంటే. ముఖ్యంగా ముదురు భామలంతా ఈ సంవత్సరం తమకో తోడుని సెట్ చేసుకుని సెటిల్ అయ్యిపోతున్నారు. అయితే ఆ పెళ్లిళ్లను బాహాటంగా చేసుకోవటానికి ఇష్టపడటం లేదు.

ఏ ఇతరదేశమో వెళ్లి అక్కడ సైలెంట్ గా వెస్ట్రన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్లు చేసుకోబోయేది కూడా ఇతరదేశపు కోటీశ్వరలనే అనుకోండి. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ లిసా హేడెన్ ధాయిలాండ్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చాలా ముచ్చటగా జరిగింది. ముచ్చటగా అని ఎందుకు అన్నామో క్రింద ఫొటోలు చూస్తే మీకు అర్దం అవుతుంది.

పాకిస్తాన్ లో పుట్టిన బ్రిటన్ వ్యాపారవత్త డినో లల్వానితో చాలాకాలం నుండి ప్రేమాయణం సాగిస్తోంది ఈ బ్యూటి ఈ పెళ్లితో తమ లవ్ ఎఫైర్ కు చక్కటి ముగింపు ఇచ్చింది.. చెన్నయ్ లో పుట్టి ఫారిన్ లో పెరిగిన లిసా.. తెలుగులో రామ్ చరణ్ 'రచ్చ' సినిమా టైటిల్ సాంగులో ఇచ్చిన స్పెషల్ ఎప్పీయిరెన్సుతో మనందరికి సుపరిచితం. ఈ భామ ఒక నెల క్రిందట త్వరలోనే డినోను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి,ఇదిగో ఇలా పెళ్లి చేసుకుంది.

బీచ్ లో వివాహం

బీచ్ లో వివాహం

ధాయిలాండ్ లోని ఓ బీచ్ లో ఆమె వివాహం చేసుకుంది. తన ఫ్రెండ్స్ ని, బాగా దగ్గర బంధువులను ఆమె ఈ వివాహానికి పిలిచింది. పూర్తి ఇంటి వ్యవహారంగా ముగించింది. అంతేకాని బాలీవుడ్ బ్యాండ్ బాజా భరత్ వివాహాల్లా గ్రాండ్ గా చేసుకోలేదు.

తనే స్వయంగా పెళ్లి ఫొటోలను

తనే స్వయంగా పెళ్లి ఫొటోలను

ఇక తన పెళ్లి ఫొటోలు వేరే వాళ్ల ద్వారా మీడియాకు లీక్ అవటం ఎందుకనుకుందో ఏమో...మ్యారేజ్ ఫోటోలన్నీ స్వయంగా తనే షేర్ చేసింది లీసా. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో, మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆమె వివాహాన్ని ఎవరూ పెద్ద సీరియస్ ఎఫైర్ గా భావించటం లేదు. చాలా క్యాజువల్ గా బెస్ట్ విషెష్ చెప్పారు.

వైన్ గ్లాసులు సాక్షిగా

వైన్ గ్లాసులు సాక్షిగా

ఇక వివాహం...బీచ్ లో తమ సంప్రదాయం ప్రకారం చేసుకుంది. ప్రెండ్స్ అందరూ ఉత్సాహంగా గ్లాసులు ఎత్తి శుభాకాంక్షలు తెలియచేసారు. బంధువులు హగ్ లతో ఆమెను ఆనందపరిచారు. ఈ జంట ఫొటోలు చూస్తే ఆనందడోలికల్లో ఊగుతున్నట్లు అర్దం అవుతుంది. సరిగ్గా గమనించండి , చుట్టూ ఉన్నవాళ్ళని పట్టించుకోకుండా ఎంత ఆనందంగా ఉన్నారో.

కెరీర్ లో పెద్ద కిక్ లేదు కానీ

కెరీర్ లో పెద్ద కిక్ లేదు కానీ

లీసా హెడెన్. 2010లోనే బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టినా... చెప్పుకోదగ్గ హిట్ సినిమాలే ఆమె ఖాతాలో లేవు. లాస్ట్ ఇయిర్ రిలీజైన ‘హౌస్‌ఫుల్ 3' సినిమా లీసా కెరీర్లో చేసిన పెద్ద సినిమా. అయితే నటిగా గుర్తింపు లేక పోయినా...మోడలింగ్ రంగంలో తన అందాల ఆరబోత ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియానే సీక్రెట్ అని అర్దమై

సోషల్ మీడియానే సీక్రెట్ అని అర్దమై

ఇండియాలోని ప్రముఖ మేగజైన్లింటిపైనా లీసా హాట్ ఫోటోస్ ప్రచురించబడ్డాయి. బాలీవుడ్లో నటిగా అవకాశాలు దక్కించుకోవాలంటే గ్లామర్ పరంగా గుర్తింపు తెచ్చుకోవాలనే విషయాన్ని గ్రహించిన లీసా...సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన హాట్ అండ్ సెక్సీ ఫోటోలు పోస్టు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఆ పొటోలు వైరల్

ఆ పొటోలు వైరల్

ఇటీవల కాలంలో ఆమె వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పర్సనల్ లైఫ్ ఫోటోస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి విచ్చలవిడిగా ఎంజాయ్ చేసిన ఫోటోలు పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోల్లో లీసా హెడెన్ అందాల ప్రదర్శన మరీ వైల్డ్ గా ఉందనే విమర్శలు వినిపించాయి.

బికినీలో ఎక్కువ

బికినీలో ఎక్కువ

ఆమె పోస్టు చేసే ఫోటోలన్నీ మినిమమ్ బికినీకి తక్కువ కాకుండా ఉండటం... కొన్ని సార్లు టాప్ లెస్ పోస్టులు చేయడం గమనార్హం. లీసా ఇంత వైల్డ్ గా అందాలు ఆరబోయడం పబ్లిసిటీ పెంచుకోవాలనే కారణమే ఉందని అంటున్నారు.

ఎప్పటికప్పుడు అప్ డేట్స్

ఎప్పటికప్పుడు అప్ డేట్స్

డినో, లీసాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. లీసా సోషల్‌మీడియా ద్వారా తరచూ డినోతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్లి విషయమై లీసా కాస్త వెరైటీగా డినోని ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇతన్ని పెళ్లిచేసుకుంటున్నా'' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

ఛైర్మన్ స్దాయి వ్యక్తితో

ఛైర్మన్ స్దాయి వ్యక్తితో

డినో లల్వానీ తన తండ్రి ప్రారంభించిన బినాటోన్‌ టెలికాం కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంటే బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన వాడే అన్నమాట అంటున్నారు బాలీవుడ్ బ్యాచ్. ఆమె అదృష్టానికి అసూయ పడుతున్నారు.

టీచర్ కాబోయే హీరోయిన్

టీచర్ కాబోయే హీరోయిన్

18 ఏళ్ల వయసులో లీసా హెడెన్ యోగా టీచర్ అవ్వాలనుకుంది. తర్వాత స్నేహితుల సలహాతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.ఆస్ట్రేలియాలోనే.. లీసా హెడెన్ ఆస్ట్రేలియాలోనే తన మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది.

స్పీడుగా పికప్

స్పీడుగా పికప్

లీసా హెడెన్ సోదరి మల్లికా హెడెన్ కూడా ఇండియాలో మోడలింగ్ రంగంలోనే ఉండటంతో 2007లో లీసా కూడా ఇండియా వచ్చింది. ఫ్యాషన్ విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ తో పాటు పలు ఫ్యాషన్ షోలలో అందాలు ప్రదర్శించింది. అది సక్సెస్ అవటంతో ఆమె కెరీర్ స్పీడుగా పికప్ అయ్యింది.

ఏలింది చాలా కాలం

ఏలింది చాలా కాలం

హ్యుందర్ ఐ 20, ఇండిగో నేషన్, మంత్రా డాట్ కామ్, బ్లెండర్స్ ప్రైడ్ లాంటి ప్రకటన్లో నటించింది. బాలీవుడ్లో 2010లో ఏసా సినిమా ద్వారా లీసా హెడెన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మోడలింగ్ రంగంలోనూ ఆమె ఏలిందనే చెప్పాలి. ఆమెకు మంచి ఆఫర్స్, భారీ డబ్బుతో వచ్చాయి. కానీ సినిమా రంగమే కరుణించలేదు.

కష్టాలు తప్పవంటూ..

కష్టాలు తప్పవంటూ..

మోడలింగ్' నేపథ్యం ఉన్న నటీమణులకు బాలీవుడ్‌లో అడుగడుగునా కష్టాలు తప్పవని ప్రఖ్యాత మోడల్, సినీ నటి లిసా హేడన్ ఆరోపిస్తోంది. ఈ 30 ఏళ్ల ముద్దుగుమ్మ ఇప్పటి వరకూ కొద్ది హిందీ సినిమాల్లో నటించినా- ‘అందాల ఆరబోత'తో అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంటోంది.

అక్కడెంత ఫేమస్ అయ్యినా

అక్కడెంత ఫేమస్ అయ్యినా

2010లో ‘అయిషా'తో నటనకు శ్రీకారం చుట్టిన ఈమె ఆ తర్వాత సంజయ్ దత్, అజయ్ దేవగన్ నటించిన ‘రాస్కేల్స్'లో నటించి బాలీవుడ్‌లో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ రంగంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ- హిందీ చలన చిత్రసీమలో రాణించడం ఎంతో కష్టసాధ్యమని తన అనుభవాలను తాజాగా మీడియా ముందు వెళ్లబోసుకుంది.

మమ్మల్ని చిన్నచూపు

మమ్మల్ని చిన్నచూపు

నటనకు ఆసక్తి చూపే మోడల్స్ పట్ల బాలీవుడ్‌లో ఎందుకో చాలా చిన్నచూపు చూస్తారని, ఎన్నో రకాల అపోహలు సైతం ఉన్నాయని లిసా అంటోంది. ఇలాంటి భావజాలాన్ని వ్యక్తిగతంగా తాను ఏ మాత్రం పట్టించుకోనని, అయితే బాలీవుడ్‌లో ఎదగాలంటే మోడల్స్ అనునిత్యం అనేక అవస్థల్ని ఎదుర్కోక తప్పదని ఆమె చెబుతోంది.

ఎదో పేరు తెచ్చుకోవాలని కాదు

ఎదో పేరు తెచ్చుకోవాలని కాదు

మోడలింగ్‌లో గొప్ప పేరు సంపాదించాలన్నది తన తొలి ప్రాధాన్యం కాదని, ‘యోగా' టీచర్‌గా పనిచేయాలన్నది తన చిన్నప్పటి కల అని లిసా గుర్తు చేస్తోంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా తాను తట్టుకుంటానని ధీమాగా అంటుంది లీసా

ఊహించని రీతిలో

ఊహించని రీతిలో

యుక్త వయసులో ‘యోగా' శిక్షకురాలిగా పనిచేయడం అసాధ్యం గనుక ఆ ఆలోచనకు గతంలోనే దూరమయ్యానని, అనూహ్యరీతిలో మోడలింగ్‌లో ప్రవేశించానని ఆమె వివరించింది. దేశ వ్యాప్తంగా ఎన్నో ఫ్యాషన్ షోల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని, మోడలింగ్‌ను వృత్తిగా ఎంచుకోవడాన్ని తాను గర్వంగానే భావిస్తున్నానని ఆమె చెబుతోంది.

అసలు విషయం చెప్పేసింది

అసలు విషయం చెప్పేసింది

భవిష్యత్‌లో తాను ‘యోగా' శిక్షకురాలిగా సేవలందించవచ్చని, అయితే ‘గ్లామర్' ప్రపంచం నుంచి పూర్తిగా నిష్క్రమించేది లేదని తన అంతరంగంలోని అసలు విషయాన్ని బయటపెట్టింది. సౌందర్య సాధనాలకు ప్రచారం చేయడంలోనో, యువతులకు ‘గ్లామర్ రహస్యాల'ను చెప్పడంలోనో తాను కాలక్షేపం చేస్తుంటానని లిసా అంటోంది.

ఆరేళ్లు దాటిపోయినా

ఆరేళ్లు దాటిపోయినా

సినిమా కంటే ఏదో ఒక కబుర్లతోనే వార్తల్లో నానతూ ఉంటుంది బాలీవుడ్ హాటీ లీసా హెడెన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆరేళ్లు దాటిపోయినా.. ఇప్పటికీ సరైన హిట్ ఆమె అకౌంట్ లో లేదు. రీసెంట్ గా హౌజ్ ఫుల్ 3 మంచి హిట్ సాధించడం ఒక్కటే.. మొత్తం ఈమె కెరీర్ లో చెప్పుకోవాల్సిన విషయం. అయితే.. సినిమాల్లో నటన కంటే వాటిలో అందాల ఆరబోతతోనే ఎక్కువగా పేరు గుర్తింపు సాధించడం లీసా స్పెషాలిటీ.

అందరికీ షాక్ ఇచ్చింది

అందరికీ షాక్ ఇచ్చింది

మొన్న రిలీజైన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో లీసా రణబీర్ కపూర్ గాళ్ ఫ్రెండ్ గా ఒక రోల్ చేసింది. కామెడీ టైమింగ్ అండ్ పంచ్ తో లీసా అదరగొట్టేసింది. అందరూ ఆ యాక్ట్ ను ఎంజాయ్ చేస్తున్న వేళ సడన్ గా తనకు పెళ్ళి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

English summary
Actress Lisa Haydon got married to her beau Dino Lalvani after the two dated for a year. Lalvani is the son of Pakistan-born British entrepreneur Gullu Lalvani. Lisa and fashion designer Malini Ramani took to their Instagram accounts to share a few images from the ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu