»   » అనుపమ ని అందుకే తీసుకోవటం లేదట: పాపం మొహమ్మీదే చెప్పేసారట

అనుపమ ని అందుకే తీసుకోవటం లేదట: పాపం మొహమ్మీదే చెప్పేసారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

అ..ఆ..తో అరంగేట్రం చేసిన ఈ మలయాళీ సుందరి.. ఆ తర్వాత ప్రేమమ్ తో కూడా మరో సూపర్ హిట్ కొట్టింది. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన శతమానం భవతితో మరో బ్లాక్ బస్టర్ సాధించి.. హ్యాట్రిక్ కొట్టేసింది ఈ బ్యూటీకి టాలీవుడ్ లో లక్కీ బ్యూటీ అనే పేరు వచ్చేసింది. అయినా చాన్సులు మాత్రం రావటం లేదు. అలా ఆమెను దూరం పెట్టటానికి దర్శకులు, నిర్మాతలు చెప్తున్న కారణమూ పాపం అనిపించేలా ఉంది...

అయితే..

అయితే..

ఆన్ స్క్రీన్ పై అందాల ఆరబోత విషయంలో అనుపమ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతందనే టాక్ ఉంది. అందుకే రామ్ చరణ్-సుకుమార్ సినిమాలోను.. నాని మూవీలోను అవకాశం కోల్పోయిందని టాక్. ఆ విషయంపై స్పష్టంగా చెప్పలేం కానీ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అమ్మడు ఓ రేంజ్ లో మతిపోగొట్టేస్తోంది.

Nani Ninnu Kori Movie Review
శతమానం భవతి

శతమానం భవతి

సక్సెస్ మీట్ కు చక్కగా పద్ధతిగా తెలుగమ్మాయి టైపులో చీరకట్టులో వచ్చేసి తెలుగులో మాట్లాడేసింది అనుపమ. కానీ చీరకట్టులో ఎన్నేసి అందాలను చూపించచ్చో.. ఎంత గ్లామర్ ఒలికించచ్చో.. ఆ మొత్తం పలికించేసింది. అయితే ఎంత అందం ఒలకబోసినా, లక్కీ బ్యూటీ అనిపించుకున్నా.. అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఆమె ఎత్తు ఆమెకు శాపం

ఆమె ఎత్తు ఆమెకు శాపం

అందంగా లేకపోతేనే, నటించడం రాకపోతేనే హీరోయిన్‌గా అవకాశాలు రాకపోవచ్చు. కానీ ఓ హీరోయిన్‌ విషయంలో ఆమె ఎత్తు ఆమెకు శాపంగా మారిందట! తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌కు మంచి పేరుంది.

ఎత్తు తక్కువగా ఉండడం

ఎత్తు తక్కువగా ఉండడం

అయితే ఆమె ఎత్తు తక్కువగా ఉండడం, టాలీవుడ్‌లో అందరూ హీరోలు దాదాపు ఆరడుగులు ఎత్తు ఉండడంతో వారి పక్కన అనుపమ మరీ పొట్టిగా కనిపిస్తుందని ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదట! తెలుగులో ‘శతమానంభవతి' తరువాత అనుపమ కొందరు దర్శకులను కలిసి అవకాశావలు అడిగితే నువ్వు పొట్టిగా ఉన్నావు కనుక ఛాన్సులు ఇవ్వడం కుదరదు అని ముఖం మీదే చెప్పేశారట.

ఛాన్సుల గురించి అడగదట

ఛాన్సుల గురించి అడగదట

వారి మాటలకు నొచ్చుకున్న అనుపమ ఇక ఎవరినీ ఛాన్సుల గురించి అడగకూడదని నిర్ణయించుకుందట! వారంతట వారుగా వస్తే తప్ప సినిమాలు చేయకూడదనిన డిసైడ్‌ అయిందట! రామ్ చరణ్ వంటి పెద్ద హీరోతో సినిమాలో చాన్స్ వచ్చినట్లే వచ్చి చివరి నిముషంలో చేజారిపోవడంతో కాస్త షాక్ తిన్నా.. మెచ్యూరిటీ ప్రదర్శించి హుందాగా వైఫల్యాన్ని అంగీకరించడమే కాదు.. ఆ చిత్ర దర్శకుల మంచివారే అని కామెంట్ కూడా చేసి పాజిటివ్ మార్కులు కొట్టేసింది.

రంగస్థలం సినిమాలో

రంగస్థలం సినిమాలో

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ రంగస్థలం సినిమాలో ముందు మెయిన్ హీరోయిన్ గా అనుపమనే తీసుకున్నారు. రెండురోజులు షూటింగ్ కూడా చేశారట.. అయితే ఇంతలోనే అనుపమను తప్పించినట్టు చెప్పారు. కానీ ఎందుకూ ఏమిటన్నది చెప్పలేదు. నాని తో చేయాల్సిన నిన్నుకోరి కూడా అలాగే అయ్యింది.

హైట్ పెరగమంటే ఎలా

హైట్ పెరగమంటే ఎలా

అయినా ఏదో కలరూ, గ్లామరూ అంటే పెంచుకుంటుందేమో గానీ హైట్ పెరగమంటే ఎలా? ఇదే కారణం తో నిత్యామీనన్ కి కూడా కొందరు హీరోలు నో చెప్పిన సంగతి తెలిసిందే కదా. పాపం ఇప్పుడు అనుపమ కూడా అలాగే అడపాదదపా మాత్రమే కనిపిస్తుందేమో...

English summary
Malayali beauty Anupama Parameswaran rejected for some Tollywood projects like "rangasthalam, Ninnu kori because of her height
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu