»   » ‘బీయింగ్ హ్యూమన్‌’: పవన్ కళ్యాణ్ కూడా చేయాలని..

‘బీయింగ్ హ్యూమన్‌’: పవన్ కళ్యాణ్ కూడా చేయాలని..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రాణాంతక వ్యాధితో పోరాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ శ్రీజ....ఆయన అందించిన సహకారం, మనోధైర్యంతో పూర్తిస్థాయిలో కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీజ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ ని కలిసింది. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ సంస్థ లాంటి స్థాపించడం లేదా, అలాంటి సంస్థలకు పవన్ కళ్యాణ్ కూడా ప్రచార కర్తగా ఉంటే బావుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు, అభిమానులకు ఆయన అంతకంటే ఎక్కువ. తన ఆలోచనలు, జీవన విధానం, సేవ కార్యక్రమాలు ఆయనన్ను అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఉన్న స్టార్లలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఏ హీరోకూ లేదంటే అతిశయోక్తి కాదేమో.

పవన్ కళ్యాణ్ హీరో విత్ ఎ సోషల్ రెస్పాన్సబులిటీ. ఇంకా అంతకంటే బెటర్ గా చెప్పాలంటే మ్యాన్ విత్ గ్రేట్ సోషల్ రెస్పాన్సబులిటీ....అలాంటి వారినే హీరో అని పిలుస్తారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సోషల్ రెస్పాన్సబులిటీలో భాగంగా....మరో బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ ప్రారంభించిన ‘MARD'(మ్యాన్ ఎగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) కార్యక్రమానికి ప్రచం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ తరుపున ప్రచారం చేస్తే బావుంటుందని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు... 

బీయింగ్ హ్యూమన్ అంటే ఏమిటి?

బీయింగ్ హ్యూమన్ అంటే ఏమిటి?

బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ అనేది సల్మాన్ ఖాన్ స్థాపించిన రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్. పేదలకు సహాయం చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. తొలి నాళ్లలో ఈ ఫౌండేషన్ కోసం సల్మాన్ ఖాన్ తన సొంత డబ్బు ఖర్చు పెట్టారు. రెండు అంశాలపై ఈ పౌండేషన్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఒకటి విద్య, మరొకటి హెల్త్ కేర్. తర్వాత ఈ సంస్థ బియింగ్ హ్యూమన్ ఆర్ట్, బీయింగ్ హ్యూమన్ సరుకులు, బీయింగ్ హ్యూమన్ గీతాంజలి గోల్డ్ కాయిన్స్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించింది.

పవన్ కళ్యాణ్ పాపులారిటీ

పవన్ కళ్యాణ్ పాపులారిటీ

పవన్ కళ్యాణ్ కు సౌత్ లో భారీగా పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. బీయింగ్ హ్యూమన్ లాంటి సంస్థకు ప్రచారం చేయడం లేదా, అలాంటి సంస్థను స్థాపిస్తే బావుంటుందని కోరుకుంటున్నారు.

ప్రభావవంతమైన వ్యక్తి

ప్రభావవంతమైన వ్యక్తి

పాపులర్ వ్యక్తులు, ప్రభావవంతమైన వ్యక్తులకు చాలా తేడా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు కలగలిపి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఏ మంచి పని చేసినా ప్రభావం త్వరగా కనిపిస్తుంది.

పవన్ కళ్యాణ్- డబ్బు కోసం కాదు

పవన్ కళ్యాణ్- డబ్బు కోసం కాదు

పవన్ కళ్యాణ్ డబ్బు కోసం ఎలాంటి ప్రచారం చేయరు. కెరీర్ తొలి నాళ్లలో ఆయన పెక్సీకి ప్రచారం చేసినా....ఆ తర్వాత వదిలేసారు. అయితే ఇపుడు బీయింగ్ హ్యూమన్ లాంటి మంచి పనులు చేసే సంస్థలకు ఆయన ప్రచారం చేస్తే బావుంటుందని కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ నిజాయితీ

పవన్ కళ్యాణ్ నిజాయితీ

పవన్ కళ్యాణ్ నిజాయితీ, ఆయన మంచితనమే ఈ రోజు ఆయనకు ఇంత పేరును, విలువను తెచ్చి పెట్టింది.

సల్మాన్-పవన్

సల్మాన్-పవన్

సేవా భావం విషయంలో, మంచి పనులు చేయాలనే తపనపడటంలో పవన్ కళ్యాన్, సల్మాన్ మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి.

English summary
Isn't that a brilliant idea to chose Pawan Kalyan as the face of Salman Khan's Being Human brand ? From past few days, this has been the talk that is being discussed on social networking platforms, largely. Ever since Pawan Kalyan met his fan, Srija, after her recovery from dreadful disease. Some of the enthusiastic fans came up with this unique thought.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu