For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నో మూడ్, ఏకాదశి ఇంకా... : 'గబ్బర్ సింగ్'...కొన్ని సీక్రెట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కెరీర్ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు 'గబ్బర్‌సింగ్'చిత్రం ఘన విజయం సాధించి ఆదుకుంది. ఆ ఉత్సాహంలో ఆయన చేసిన అత్తారింటికి దారేది చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ మరో చిత్రం ప్రారంభించి పూర్తి చేసే పనిలో ఉన్నారు.

  గబ్బర్ సింగ్ ఈ చిత్రం ట్రీట్ మెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ సహకారం చాలా ఉందని మీడియా వర్గాల్లో చెప్పుకున్నారు. ఈ విషయమై చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు. సినిమా విషయంలో కల్యాణ్‌గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.

  Also Read: పవన్ తో విభేధాలు లేవు, 'గబ్బర్‌సింగ్-2' చేయకపోవటమే బెస్ట్

  పవన్ కళ్యాణ్ కు కథ నచ్చితే ఆయన విపరీతంగా ఇన్ ఫుట్స్ ఇస్తూంటారు అంటూంటారు. దాన్ని కొందరు ఆయనే చేస్తూంటారు అంటారు కానీ అల్టిమేట్ గా హిట్ అనేది అవసరమని ఆయన భావించి తన మనస్సుకు నచ్చిన విషయాలని స్క్రిప్టులో పెడుతూంటారు. అవి చాలా సార్లు సక్సెస్ అవుతూంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ చేస్తున్న చిత్రానికి సైతం అన్నీ ఆయనే దగ్గరుండి చేస్తున్నారు.

  Also Read: పవన్ పర్సనల్ ఆల్బం నుంచి... (అరుదైన ఫొటోలు)

  మొదటి నుంచీ హరీష్ శంకర్ ..పవన్ కి వీరాభిమాని...ఎంత అంటే... కల్యాణ్ కటౌట్‌కి పాలాభిషేకం చేసేటంత..ఆయన తను స్వయంగా పవన్ సినిమాని డైరక్ట్ చేస్తానను కోలేదు. హరీష్ కు ఎప్పటికైనా ఒకటే డ్రీమ్ కల్యాణ్‌ని కలిసి ఓ ఫొటోగ్రాఫు, ఓ ఆటోగ్రాఫు తీసుకోవా లనేది.అలాంటిదే ఏకంగా సినిమానే ఇచ్చేసాడు గిప్ట్ గా పవన్ . ఇది ఎలా జరిగింది...

  Also Read: ‘గబ్బర్‌సింగ్'లో పవన్‌కల్యాణ్ కంట్రిబ్యూషన్ ఎంత?

  రికార్డ్ లు తిరిగరాసిన గబ్బర్ సింగ్ బిహైండ్ స్టోరీ స్లైడ్ షోలో ..

  షాక్ కొట్టి ఉన్నాడు

  షాక్ కొట్టి ఉన్నాడు

  రవితేజ తో వర్మ నిర్మాతగా హరీష్ చేసిన 'షాక్' సినిమా ఫ్లాఫ్. ఊహించని దెబ్బకు ఏం చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడు

  ఆంజనేయులు కోసం వెళితే

  ఆంజనేయులు కోసం వెళితే

  రవితేజ కోసం ఆంజనేయులు సెట్ కు వెళ్లిన హరీష్ కు అక్కడ బండ్ల గణేష్ పరిచయం అయ్యాడు

  పవన్ ఇంటికి రా

  పవన్ ఇంటికి రా

  ఓ రోజు బండ్ల గణేశ్ నుంచి ఫోన్. ''అర్జంట్‌గా 'నందగిరి హిల్స్'కు రా.'' నందగిరి హిల్స్ అంటే పవన్‌కల్యాణ్ ఇల్లు ఉన్న ఏరియా.

  పవన్ కు కథ చెప్పాలి

  పవన్ కు కథ చెప్పాలి

  ''నేను కల్యాణ్‌తో ఫామ్‌హౌస్‌కి వెళ్తున్నా, నువ్వు నా కారులో అక్కడికొచ్చేయ్. అదిరిపోయే కథ చెప్పాలి'' అని చెప్పాడు బండ్ల గణేష్

  టెన్షన్.

  టెన్షన్.

  కల్యాణ్‌కి ఏ కథ చెప్పాలి? ఎలా చెప్పాలి? మంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ చెబుదామా? ఇవే ఆలోచనలు. హరీశ్‌కి నిజంగా విపరీతమైన టెన్షన్ మూవ్ మెంట్స్ అవి.

  ఎలా..డైలమా

  ఎలా..డైలమా

  ''ఇప్పటికిప్పుడు లవ్‌స్టోరీ ఎలా? రవి తేజ కోసం చేస్తున్న లైన్ చెప్పేద్దామా? కల్యాణ్ బాబుకి బావుంటుంది. అప్పటి కప్పుడు టైటిల్ కూడా అనేసుకున్నాడు 'రొమాంటిక్ రిషి'.

  మూడ్..రిక్వెస్ట్

  మూడ్..రిక్వెస్ట్

  పవన్ ''ఈ రోజు నాకు మూడ్ సరిగ్గా లేదు. ఇంకోరోజు కథ వింటా'' చెప్పాడు కల్యాణ్. గణేశ్ ''బాబూ! ఈ రోజు ఏకాదశి. మంచి రోజు. హరీష్ కి సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక అయిదు నిమిషాలైనా కథ వింటే..?'' అని రిక్వెస్ట్ చేసాడు.

   కానివ్వు..

  కానివ్వు..

  ''ఓకే... మీ సెంటిమెంట్స్‌ని నేనెందుకు కాదనాలి'' అని అక్కడే చెట్టు దగ్గర కూర్చున్నాడు పవన్‌కల్యాణ్. హరీష్ మొదలెట్టాడు...కథ వింటూ నవ్వుతూనే ఉన్నాడు.

  ఫుల్ హ్యాపీ

  ఫుల్ హ్యాపీ

  ''వియ్ డూ దిస్ ఫిల్మ్'' అని హరీశ్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి లేచాడు కల్యాణ్. కాస్సేపటి తర్వాత గణేశ్ వచ్చి హరీశ్‌ను హగ్ చేసుకుని కంగాట్స్ చెప్పాడు.

  ఛేంజెస్..ఫుల్ బిజీ

  ఛేంజెస్..ఫుల్ బిజీ

  హరీశ్ స్క్రిప్టు వర్క్ మొదలెట్టాడు. కల్యాణ్‌కు ఇంకా సెకండాఫ్ చెప్పాలి.ఛేంజెస్ చెప్పాలి. బెటర్‌మెంట్స్ చెప్పాలి. కానీ అక్కడేమో కల్యాణ్ ఫుల్ బిజీ. అపాయింట్‌మెంట్ కూడా దొరకని స్థితి.

  ఇంకో ప్రక్క

  ఇంకో ప్రక్క

  ఆ టైమ్‌లో ఓ వార్త. హిందీ సినిమా 'లవ్ ఆజ్ కల్' బేస్‌తో కల్యాణ్ ఓ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. బండ్ల గణేశ్ ప్రొడ్యూసర్. త్రివిక్రమ్ స్క్రిప్టు రాస్తున్నాడు. డెరైక్టర్ ఎవరో తెలియదు.

  జయంత్ తో

  జయంత్ తో

  జయంత్. సి.పరాన్జీ డెరైక్షన్‌లో 'తీన్‌మార్' మొదలెట్టారు కల్యాణ్. హరీశ్ పరిస్థితేంటి?

  వెంటనే రవితేజా తో

  వెంటనే రవితేజా తో

  కల్యాణ్ కోసం తీర్చిదిద్దిన 'రొమాంటిక్ రిషి' రవి తేజకు షిఫ్ట్. ''మరీ క్లాస్ టైటిల్లా ఉందినిస 'మిరపకాయ్' గా మార్చడు రవితేజ. ఈ సలహా అందరికి ఓకే.

  కాంతి

  కాంతి


  2011 సంక్రాంతికొచ్చిన మిరపకాయ సూపర్ హిట్, అందే ఈ సినిమా హరీశ్ లైఫ్‌లో కొత్త క్రాంతి వచ్చింది.

  పవన్ కాలింగ్

  పవన్ కాలింగ్

  మిరపకాయ హిట్టవటం...పవన్ నుంచి కాల్ రావటం జరిగాయి.

  నువ్వే డైరక్టర్ వి

  నువ్వే డైరక్టర్ వి

  కల్యాణ్ ఇంటికెళ్లేసరికి ఫొటో సెషన్ జరుగుతోంది. కల్యాణ్ పోలీసాఫీసర్ గెటప్‌లో ఉన్నాడు.హరీశ్‌కేం అర్థం కాలేదు. 'దబంగ్'ను తెలుగులో చేస్తున్నాం, సినిమా పేరు 'గబ్బర్‌సింగ్', డెరైక్టర్‌వి నువ్వే'' చెప్పాడు కల్యాణ్ కుల్ గా

  డైలాగ్స్ రాస్తా...

  డైలాగ్స్ రాస్తా...

  ముందు మీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులూ చేర్పులూ, డైలాగ్స్ రాసే అవకాశమివ్వండి చాలు. అదే నాకు పెద్ద రెమ్యునరేషన్'' చెప్పాడు నిజాయతీగా. కల్యాణ్ నవ్వుతూ అడ్వాన్స్ కవర్ అతని చేతికిచ్చాడు. నెక్స్ట్ మినిట్‌లో మీడియాలో న్యూస్

   ఓకే సార్

  ఓకే సార్

  కల్యాణ్‌ని మాస్ ఎలా చూడాలనుకుంటు న్నారో అలా స్క్రిప్ట్‌ని డిజైన్ చేసుకున్నాడు. కోల్‌కతాలో 'పంజా'షూటింగ్ స్పాట్ వెళ్లి చెప్పాడు, కల్యాణ్ టక టకా తన సజెషన్స్ చెప్పేశాడు.

  అంత్యాక్షరి

  అంత్యాక్షరి

  ''పోలీస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి సీన్ పెడదాం, కామెడీ క్రియేట్ బాగుంటుంది. 'పాడమంటే పాడేది పాట కాదు' లాంటి పాటలు పెడదాం'' అని హింట్ ఇచ్చాడు పవన్ .

  ఫస్ట్ షాట్

  ఫస్ట్ షాట్

  ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్. హీరో యిన్‌గా శ్రుతీహాసన్‌. 2011 డిసెంబర్ 4... మిట్ట మధ్యాహ్నం 12 గంటల 20 నిముషాలకు ఫస్ట్ షాట్ తీశారు.

  టీజర్ కోసం ..

  టీజర్ కోసం ..

  'పంజా' డిజాస్టర్. ఫ్యాన్స్‌ కోలుకోవాలంటే...గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ చేయాలి. ఇంకా ఓ షెడ్యూలు కూడా ఫినిష్ కాలేదు. హరీష్ కో ఐడియా వచ్చింది,. కల్యాణ్‌తో ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పించాలి అని

  తిక్క..లెక్క

  తిక్క..లెక్క

  అనుమాన పడుతూనే కల్యాణ్ దగ్గరకు వెళ్లి ''నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది''... డైలాగ్ చెప్పాడు. వెంటనే కల్యాణ్ ఆనందపడిపోయి, క్లాప్స్ కొట్టేశాడు. టీజర్ రెడీ. ఆ ఒక్క టీజర్‌తో 'గబ్బర్‌సింగ్' ఎలా ఉండబోతోందో ఆడియన్స్ స్మెల్ చేసేశారు.

  కెవ్వు కేక సాంగ్

  కెవ్వు కేక సాంగ్

  'దబంగ్'లోని 'మున్నీ బద్‌నామ్' తరహాలో ఐటమ్ సాంగ్ కావాలి. దేవి ఫాదర్, రైటర్ సత్యమూర్తి ఆ టైమ్‌కి అక్కడే ఉన్నారు. ''ఎందుకురా టెన్షన్. 'కెవ్వు కేక' అని మొదలుపెట్టు'' అన్నా రాయన. దేవి రెచ్చిపోయాడు

  300 పాటలు

  300 పాటలు

  'అంత్యాక్షరి' ఎపిసోడ్ గురించి చాలా కసరత్తులే చేశారు. డెరైక్షన్ డిపార్ట్‌మెంట్ అంతా వర్క్ చేసి 300 పాటలు సెలక్ట్ చేశారు. వాటిల్లోంచి కొన్ని ఎంచుకున్నారు. పోలీస్ స్టేషన్ సెట్‌లో రౌడీ గ్యాంగ్‌తో రోజంతా తీయాలని ప్లాన్ చేశారు. కట్ చేస్తే - 4 గంటల్లోనే అయిపోయింది. సినిమా మొత్తం చాలా స్మూత్‌గా జరిగి పోయింది.

  టేక్ కేర్

  టేక్ కేర్

  డబ్బింగ్ అంతా కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ ఫ్లోర్‌కి దణ్ణం పెట్టి, ''ఈ సినిమా పెద్ద హిట్ అవనుంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. టేక్ కేర్'' అన్నాడు కల్యాణ్.

  పెద్ద హిట్..

  పెద్ద హిట్..

  'గబ్బర్‌సింగ్' దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. పెద్ద హిట్...హరీష్ కు పాలాభిషేకం చేసే స్ధాయి వచ్చేసింది

  సర్దార్ గబ్బర్ సింగ్

  సర్దార్ గబ్బర్ సింగ్

  ఇప్పుడు పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ బిజీలో ఉన్నాడు. గబ్బర్ సింగ్ హిట్ ని మించి హిట్టవ్వాలనే కసితో ఉన్నాడు దర్శకుడు బాబి.

  ఈసారీ కూడా

  ఈసారీ కూడా

  ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు. కథ,స్క్రీన్ ప్లే, డైలాగులు, షాట్స్ ఒకటేమిటి అన్నీ దగ్గరుండి ఓకే చేసుకుంటున్నాడు.

  టీమ్

  టీమ్

  పవన్ కళ్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంటే, లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత.

  ఎవరెవరు

  ఎవరెవరు

  బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

  English summary
  This is the behind story of Pawan's Super Hit Gabbar Singh directed by Harish Shankar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X