twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భద్రత కోసం 'తుఫాన్‌' నిర్మాతలు హైకోర్టుకి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ తేజ హీరోగా నటించిన 'జంజీర్‌' (తెలుగులో 'తుఫాన్‌') చిత్ర ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ చిత్ర నిర్మాణ సంస్థ రిలయన్స్‌ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ చిత్రం హిందీలో 'జంజీర్‌'గా, తెలుగులో 'తుఫాన్‌'గా ఈనెల 6న విడుదల కానుందని సంస్థ పేర్కొంది.

    వివరాల్లోకి వెళితే... ఈ నెల 6న విడుదల కానున్న జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శన కేంద్రాలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రిలయన్స్ బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. 'విభజన' ఆందోళన వల్ల ఈ సినిమాల ప్రదర్శనకు ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని బుధవారం దాఖలు చేసిన పిటిషన్‌లో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శిబాశిష్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. చట్ట వ్యతిరేక శక్తులు ఈ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించాయన్నారు.

    మరో ప్రక్క 'జంజీర్' సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్‌ఖాన్, జావెద్ అక్తర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావేద్‌లు కోర్టును కోరారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా కేసు వేసినందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. రామ్‌చరణ్‌తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.

    రామ్‌చరణ్ హీరోగా నటించిన చిత్రం 'తుఫాన్'. ఈ నెల 6న విడుదల కానుంది. అపూర్వ లాఖియా దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా నాయిక. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఎ సర్టిఫికెట్‌ను పొందింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమీత్ ప్రకాష్ మెహ్రా, ఫ్లైయింగ్ టర్టిల్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. "హై ఓల్టేజ్ డ్రామా మిళితమైన కథ ఇది. పాటలకు మంచి స్పందన వస్తోంది''అని నిర్మాతలు చెప్పారు. ప్రకాష్‌రాజ్, శ్రీహరి, తనికెళ్ల భరణి, మహిగిల్ కీలక పాత్రధారులు.

    English summary
    Ram Charan starrer Thoofan which will be releasing on 6th September is getting entangled in the political situations of Andhra Pradesh. In the wake of these agitations, Reliance Entertainment has filed a petition in AP High Court asking to provide police protection for the screenings of Thoofan/ Zanjeer in A.P. The petition will come to the hearing today (Sep 5th).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X