»   » షాకింగ్: సెన్సార్ బోర్డు వారే పైరసీ చేసారు...

షాకింగ్: సెన్సార్ బోర్డు వారే పైరసీ చేసారు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ పరిశ్రమకు పెద్ద సమస్యగా మారిన వాటిలో ప్రధానమైంది పైరసీ. సినిమా ఇలా రిలీజైన మరునాడే పైరసీ సీడీలు బయటకు వస్తున్నారు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు పైరసీ సినిమా థియేటర్లలో జరిగేది.

కానీ తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మలయాళం సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' పైరసీ కేసులో సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమాను పైరసీ చేసినట్టు కేరళ పోలీసులు గుర్తించారు. పైరసీకి పాల్పడ్డారన్న ఆరోపణలతో ముగ్గురు సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Three Censor Board employees arrested in 'Premam' piracy case

ప్రేమమ్ సినిమా విషయానికొస్తే...
మే 29 న విడుదలయిన ప్రేమమ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో కేరళ స్టార్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ లాంటి వారు ఎవరూ లేక పోయినా బాక్సాఫీసు వద్ద కాసులు కురిపించింది.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో, సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వుతుంటారు. ఈ పరిణామాలను దర్శకుడు అల్ఫోన్సో పుత్తరేన్ మనసుకు హత్తుకునే చూపించారు.

English summary
Three Censor Board employees arrested in 'Premam' piracy case.
Please Wait while comments are loading...