»   » నాని... నువ్వు మామూలోడివి కాదు సామి,ఈ వార్త వింటే మీరూ అదే అంటారు

నాని... నువ్వు మామూలోడివి కాదు సామి,ఈ వార్త వింటే మీరూ అదే అంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నాని జెట్ స్పీడుతో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. నేను లోకల్ నుంచి జనం బయిటపడకముందే మరో సినిమాని రెడీ చేసేస్తున్నాడు. తాజాగా నాని తన ఫ్యాన్స్ కోసం సప్రైజ్ ప్లాన్ చేశాడు.

ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు శివ నిర్వానంద్ డైరెక్షన్లో తన 19వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలో చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తోంది. ఈ నెల 24న నాని పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా తెలియచేసారు.


నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో జరుగుతోంది. మార్చి 10 వరకు ఈ షెడ్యూల్‌ వుంటుంది. మా హీరో నాని పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయడంతోపాటు టైటిల్‌ని కూడా ఎనౌన్స్‌ చెయ్యబోతున్నాం'' అన్నారు.

ఈ చిత్రంలో నానికి జోడీగా నివేత థామస్ నటిస్తోంది. నాని వరుస హిట్లతో ఒకటైన 'జెంటిల్మెన్' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేత ఆ చిత్రంలో నానికి పోటీగా నటించి అందరి ప్రసంశలు అందుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ - ''వరసగా మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చిన నాకు 'నేను లోకల్‌' తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్న టైమ్‌లో శివ వచ్చి ఈ స్టోరీ చెరప్పగానే ఇలాంటి సినిమానే చెయ్యాలనిపించి ఇమ్మీడియేట్‌గా అంగీకరించాను. ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఈ సినిమా టీమ్‌ అంతా నాకు ఇష్టమైన టీమ్‌. శివ, కోన వెంకట్‌, కార్తీక్‌ ఘట్టమనేని, గోపీసుందర్‌, హీరోయిన్‌ నివేథా వీళ్ళందరితో కలిసి చెయ్యడం చాలా హ్యాపీగా వుంది.

నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''నానితో ఫస్ట్‌ టైమ్‌ మా బేనర్‌లో చేస్తున్నాం. ఈ చిత్రం 80 శాతం షూటింగ్‌ అమెరికాలో వుంటుంది. చాలా భారీ సినిమా. మిగిలిన షూటింగ్‌ హైదరాబాద్‌, వైజాగ్‌లలో జరుగుతుంది. శివ చెప్పిన కథ నచ్చి కథకు పూర్తి న్యాయం జరిగేలా భారీ ఎత్తున ఈ సినిమా చేస్తున్నాం. డిసెంబర్‌ 5 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి ఏకధాటిగా చేస్తున్నాం'' అన్నారు.

హీరోయిన్‌ నివేథా థామస్‌ మాట్లాడుతూ - ''జెంటిల్‌మన్‌ తర్వాత నానితో మళ్ళీ వర్క్‌ చెయ్యడం ఆనందంగా వుంది. ఈ సబ్జెక్ట్‌, ఈ టీమ్‌ అంతా వండర్‌ఫుల్‌. చాలా ఎక్సైటింగ్‌గా వున్నాను'' అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''ఒక సెన్సిబుల్‌ పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌ వేలో చెప్పే ప్రయత్నం ఇది. నానికి కథ చెప్పగానే వెంటనే ఓకే అన్నారు. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు ఇంకా గ్రిప్‌ తెచ్చింది. దానయ్యగారిలాంటి పెద్ద ప్రొడ్యూసర్‌ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో నా తొలి చిత్రం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.

రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ - ''నాని, ఆది ఫస్ట్‌ కాంబినేషన్‌, నాని, నివేథా హిట్‌ కాంబినేషన్‌, డైరెక్టర్‌ శివ మంచి టాలెంట్‌, సబ్జెక్ట్‌ చాలా బాగుంటుంది. నాని వరస విజయాల్లో ఇది మరో హిట్‌ మూవీ అవుతుంది. దానయ్య డి.వి.వి. కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని లావిష్‌గా తీస్తున్నారు'' అన్నారు.


నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

English summary
Nani is working on his 19th movie. Nani took to his Twitter and revealed that the film’s title and first look will be revealed tomorrow.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu