twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుట్టిన రోజు స్పెషల్ : అల్లు అర్జున్ ఇంటర్వూ(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్ నటించిన చిత్రాలు తక్కువే అయినా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. ప్రతి చిత్రానికి నటుడుగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలన్న తపన వున్న ఏ నటుడైనా ఓ మెట్టు ఎక్కినట్టే భావించాలి. నిరంతరం కొత్తదనం కోసం ప్రయత్నించే హీరోలు తెలుగులో అరుదుగా కనిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విభిన్నతతో ప్రేక్షకులకు కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూనే వుంటారు. అటువంటివారిలో అల్లు అర్జున్ ఒకరు.

    గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య-2, వేదం, వరుడు, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, ఎవడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను తన సరికొత్త పాత్రలతో ఆకట్టుకున్న అర్జున్ ఇప్పుడు రేసుగుర్రంలా దూసుకొస్తున్నారు. ఆయన నటించిన చిత్రాలు తక్కువే అయినా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.

    సినీ ప్రయాణంలో 14 సినిమాల చరిత్రతో తనను తాను టాలీవుడ్‌లో ఆవిష్కరించుకున్న అర్జున్ అల్లురామలింగయ్య మనవడిగా కాకుండా తనకొక సరికొత్త గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నమే చేశాడు. నటుడిగా కంటే స్టార్ ఇమేజీ కోసమే ప్రయత్నిస్తూ నటుడిగా మార్కులు వేయించుకున్నారు. సినిమా షూటింగ్‌కు ఆటంకం జరిగితే నిర్మాతకు లక్షల్లో నష్టం వస్తుందని నిరంతరం ప్రతి విషయంలోనూ జాగరూకత వహించే బన్నీకి అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే వున్నారు.

    మంచి కథలు ఎవరు చెబుతారా అని ఎదురు చూస్తున్నా. నేనైతే త్రివిక్రమ్‌ సినిమా తర్వాత... తమిళంలో ఓ చిత్రం చేయాలనుకొంటున్నా అంటున్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ స్లైడ్ షోలో...

    ఆపరేషన్ చేసే ...

    ఆపరేషన్ చేసే ...

    ఆ రోజు నేను కూడా ఆస్పత్రిలోనే ఉన్నా. ఇంకా రెండు రోజులు సమయముందనుకొన్నాం. కానీ డాక్టర్లు ఆపరేషన్‌ అవసరమవుతుందని చెప్పారు. కొంచెం తర్జనభర్జనలు సాగాయి. నిర్ణయం తీసుకొన్నాక... రెండు గంటల్లో బాబు పుట్టాడని చెప్పారు.

    బాధ్యతలు మరింత పెరిగాయనుకొంటున్నా

    బాధ్యతలు మరింత పెరిగాయనుకొంటున్నా

    పెళ్లవ్వడంతోనే బాధ్యతలు మీద పడతాయి. ఇక పిల్లలు పుడితే రెట్టింపవుతాయి. నా భార్యకి ఇష్టమని నేను ఓ ఫాం హౌస్‌ కట్టుకొన్నా. ఇప్పుడు బాబు పుట్టాడు కాబట్టి... అక్కడ ఆడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. అర్జంటుగా నా మీదున్న పెద్ద బాధ్యత అదే. ఇలాంటి బాధ్యతలు ఇక నుంచి ఇంకా చాలానే ఉంటాయి.

    అమ్మాయంటేనే ఇష్టం...

    అమ్మాయంటేనే ఇష్టం...

    నాకు అమ్మాయంటేనే ఇష్టం. మొదట అమ్మాయి పుడితే బాగుంటుందనుకొన్నాను. అయినా... మన చేతుల్లో ఏముంటుంది? ఎవరు పుట్టినా ఆనందమే.

    రివర్సు గేరు లేనోడే

    రివర్సు గేరు లేనోడే

    ఎంటర్టైన్మెంట్, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కింది. వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ అలరించేలా ఉంటుంది. నేను పోషించిన పాత్ర ఏమిటన్నది తెరపైనే చూడాలి. నేను పోలీస్‌ని కాదు. ఇందులో నా పాత్ర తీరు తెన్నులు మాత్రం సినిమా పేరుకు తగ్గట్టుగానే ఉంటాయి. బూచాడే... అంటూ సాగే పాటలో రేసుగుర్రంలాంటోడే.. రివర్సు గేరు లేనోడే... అంటూ కొన్ని మాటలుంటాయి. అచ్చం... ఆ తరహా మనస్తత్వమున్న పాత్ర అది.

    'రేసుగుర్రం'తో కుదిరింది.

    'రేసుగుర్రం'తో కుదిరింది.

    అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తీశాడు సురేందర్‌ రెడ్డి. తను మంచి దర్శకుడు. ఆయన తీసిన సినిమా విడుదలైనప్పుడల్లా.. 'మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం' అనుకొనేవాళ్లం. 'రేసుగుర్రం'తో కుదిరింది. తన స్త్టెలిష్‌ మేకింగ్‌, ఆ విషయంలో నేను తీసుకొనే శ్రద్ధ సినిమాకి చాలా ప్లస్‌ అయ్యింది.

    కథల ఎంపికలో ...

    కథల ఎంపికలో ...

    నాకు ఇలాంటి కథ కావాలి, ఇది ఉండాలి, అది ఉండాలి... అంటూ నేనేమీ చెప్పను. నేను విన్నవాటిలో మంచి కథ ఏదనిపిస్తే దాన్నే ఎంచుకొంటాను. కథ వినేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటా. చేసిన కథనే మళ్లీ చేయకూడదనుకొంటా. ఇదివరకు చేసిన తప్పు... పునరావృతం కాకడదనుకొంటా.

    పోటీ కాస్త ఎక్కువే

    పోటీ కాస్త ఎక్కువే

    పోటీ ఎప్పుడూ ఉన్నదే. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా సినిమా బాగా ఆడాలనుకొంటాను కానీ... పక్కనున్నవాళ్ల సినిమా బాగోలేదు కాబట్టి అందరూ నా సినిమాని చూడాలి, సక్సెస్‌ చేయాలి అని నేనెప్పుడూ అనుకోను. కథానాయకులు వేగంగా సినిమాలు చేయడం పరిశ్రమకు మంచిదే. నేను కూడా సాధ్యమైనంత వరకు వేగంగా సినిమాలు చేయడానికే ప్రయత్నిస్తా.

    త్రివిక్రమ్‌తో చేసే సినిమా గురించి...

    త్రివిక్రమ్‌తో చేసే సినిమా గురించి...

    త్రివిక్రమ్‌తో చేసే సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి నటిస్తానని ప్రచారం సాగుతోంది. అలాంటిదేమీ లేదు. ఆ సినిమా గురించి, అందులో పాత్రల గురించి మాట్లాడుకోవడానికి ఇంకా చాలా సమయముంది. 10న మొదలుపెడతాం కానీ.. సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది.

    పాత్రను బట్టే...

    పాత్రను బట్టే...

    ''కథ, పాత్రల్ని బట్టే నేను తెరపై కనిపించాలనుకొంటాను. 'పరుగు' సినిమానే తీసుకోండి. అందులో మధ్యతరగతి కుర్రాడిలాగే కనిపించాను. పాత్రలో ఎక్కడా నా స్త్టెల్‌ని చొప్పించే ప్రయత్నం చేయలేదు. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో పాత్ర వేరు కాబట్టి... అందులో మరింత స్టైల్‌గా కనిపించే ప్రయత్నం చేశా''.

    అదే యాటిట్యూడ్...

    అదే యాటిట్యూడ్...

    ఖరీదైన దుస్తులు, మేకప్‌ వేసుకొన్నంత మాత్రాన స్త్టెల్‌గా కనిపించలేం. స్త్టెల్‌ అనేది లోపల ఉంటుంది. దాన్నే యాటిట్యూడ్‌ అంటుంటాం. మనం నడుచుకొనే విధానాన్ని బట్టే మన స్త్టెల్‌ బయటికి కనిపిస్తుంటుంది. నా వరకు నేను స్త్టెల్‌గా కనిపించాలని ప్రత్యేకంగా ఏమీ చేయను. స్త్టెలిష్‌స్టార్‌ అంటున్నారు కదా అని ప్రతి సినిమాలోనూ స్త్టెల్‌గా కనిపించాలని ప్రయత్నించను.

    బోర్ కొట్టింది..

    బోర్ కొట్టింది..

    ''డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. డ్యాన్స్‌... ప్రతి సినిమాలోనూ చేస్తూనే ఉన్నా. ఎప్పటికప్పుడు వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నా. ఒకరకంగా డ్యాన్సులు వేసి వేసీ నాకే బోర్‌ కొట్టింది. ఎంత డ్యాన్సు వేసినా... అందులో కొత్తదనం ఏమీ ఉండదు. అంతిమంగా సినిమా బాగుండాలి. అప్పుడే డ్యాన్సులు అదనపు హంగుల్లా సినిమాకి ప్లస్‌ అవుతాయి. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని... ప్రతి సినిమాలోనూ కనీసం రెండు పాటలకైనా అదిరే డ్యాన్సులు చేయాలనుకొంటుంటా''.

    శుభాకాంక్షలు...

    శుభాకాంక్షలు...

    తెలుగులోనే కాకుండా మాలీవుడ్‌లో కూడా తన పతాకాన్ని ఎగరేస్తున్నారు. తాను అల్లు అర్జున్ కాదని, మల్లు అర్జున్‌నని అక్కడ చెప్పడం విశేషం. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా వన్ ఇండియా తెలుగు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

    English summary
    Having earned his place in the industry, Allu Arjun’s rise to stardom had very little to do with his superstar uncle and cousin (Chiranjeevi and Ram Charan Teja). His credibility as an accomplished actor took about ten years to materialize and heaps of criticism along the way. Here is wishing Bunny a very happy birthday!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X