»   » ‘జై లవ కుశ’ ఇష్యూలో ఎన్టీఆర్‌పై కాపీ రూమర్స్

‘జై లవ కుశ’ ఇష్యూలో ఎన్టీఆర్‌పై కాపీ రూమర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం 'జై లవ కుశ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవలే 'జై' పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ సాధించి సౌతిండియా రికార్డ్ నెలకొల్పింది.

అయితే ఈ టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రేక్షకులను, ఎన్టీఆర్ అభిమానులను విస్మయానికి గురి చేసింది. సోషల్ మీడియా ప్రచారాన్ని బేస్ చేసుకుని ఓ ఆంగ్లపత్రికలో కథనం కూడా వచ్చింది. పూరి చెప్పిన స్క్రిప్టులోని క్యారెక్టరైజేషన్‌ను ఎన్టీఆర్ కాపీ కొట్టారనే అనుమానాలతో ఆ  కథనం ఉండటం గమనార్హం.

పూరి దగ్గర నుండి లేపేశారా?

పూరి దగ్గర నుండి లేపేశారా?

టెంపర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న పూరి ఓ స్టోరీని, కేరక్టరైజేషన్‌ను ఎన్టీఆర్‍‌కు వినిపించాడని, తాను చెప్పినటువంటి పాత్రను పోలిన విధంగా జై‌ పాత్ర ఉండటంతో పూరి షాకయ్యాడని, ఎన్టీఆర్ తాను చెప్పిన దాన్ని దొంగిలించాడనే అనుమానాలతో పలు కథనాలు వచ్చాయి.

దారుణమైన అభాండాలే

దారుణమైన అభాండాలే

అయితే కేవలం అనుమానాలను వ్యక్తం చేస్తూ.... క్వశ్చన్ మార్క్ కథనాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడా క్లారిటీ లేదు. నిజా నిజాలు తేలకుండా ఇలాంటి దారుణమైన అభాండాలతో కథనాలు ఎలా రాస్తారని ఎన్టీఆర్ అభిమానులు మండి పడుతున్నారు.

పూర్తిగా తన కథే అంటున్న బాబీ

పూర్తిగా తన కథే అంటున్న బాబీ

అయితే జై లవ కుశ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ మాత్రం తమ స్టోరీ, అందులోని క్యారెక్టరైజేషన్లు ఎవరినీ కాపీ కొట్టింది కాదని, ఇవి పూర్తిగా తమ సొంత కథ అని అంటున్నారట. మరి దీనిపై నిర్మాత కళ్యాణ్ రామ్ ఎలా స్పందిస్తారో? చూడాలి.

నా పెళ్లాం బిడ్డలను చూసుకునేంత ఇచ్చారు: రెమ్యూనరేషన్‌పై జూ ఎన్టీఆర్

నా పెళ్లాం బిడ్డలను చూసుకునేంత ఇచ్చారు: రెమ్యూనరేషన్‌పై జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో ‘బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల షో లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తన రెమ్యూనరేషన్ గురించి ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Jai teaser from 'Jai Lava Kusa' has been released recently and it has impressed the audience. A Leading news paper has published news item that NTR stole the idea from Puri Jagannadh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu