»   » పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’ హీరోయిన్ షాకింగ్ లుక్

పవన్ కళ్యాణ్ ‘తొలి ప్రేమ’ హీరోయిన్ షాకింగ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ హిట్టయిన ప్రేమకథా చిత్రం 'తొలి ప్రేమ'. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డిని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఈ సినిమాలో హైలెట్ ఏటంటే కీర్తి రెడ్డి ఇంట్రడక్షన్ సీనే. సినిమాలో ఆమె అందం చూసి పవన్ కళ్యాణ్ ప్రేమలో పడిపోతే....ఎంతో మంది యువకులు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు.

'తొలి ప్రేమ' సినిమా తర్వాత కీర్తి రెడ్డి సినిమాలకు దూరమైంది. అక్కినేని నాగార్జున మేనల్లుడు, నటుడు సుమంత్ ను 2004లో పెళ్లాడింది. పెళ్లయిన తర్వాత ఆమె మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'అర్జున్' సినిమాలో హీరో అక్క పాత్రలో కీలకమైన రోల్ చేసింది.

Toliprema actress Keerthi Reddy shocking look

ఏమైందో తెలియదు కానీ సుమంత్, కీర్తి రెడ్డి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయి రెండేళ్లు తిరిగేలోపే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత కీర్తి రెడ్డి మరొకరిని పెళ్లి చేసుకుని యూఎస్ఏలో సెటిలవ్వడం, కీర్తిరెడ్డి దంపతులకు ఓ బాబు కూడా ఉండటం తెలిసిందే.

కొన్ని నెలల క్రితం కీర్తి రెడ్డి తన కజిన్ వివాహంలో పాల్గొనేందుకు వచ్చింది. అప్పటిటికీ...ఇప్పటికీ కీర్తి రెడ్డి చాలా మారిపోయింది. అప్పుడు అందంగా ఉండే ఆమె ఇపుడు బాగా లావెక్కి ఆంటీలా తయారైంది. ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.

English summary
Recently, Toliprema actress Keerthi Reddy attended a marriage of her Cousin. A photograph from this Wedding Ceremony shows the 'Arjun' Actress gaining few pounds but she looks so pretty even now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu