For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2013లో తెలుగు హీరోల న్యూ ప్రాజెక్ట్స్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : 2012వ సంవత్సరం ముగిసి 2013 రానే వచ్చింది. టాలీవుడ్ హీరోలంతా తమ తమ కొత్త ప్రాజెక్టులతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. మరి మన హీరోలంతా ఏ ఏడాది ఏయే సినిమాలు చేస్తున్నారు. ఎవరు, ఎన్ని సినిమాలను ప్రేక్షకులకు చూపించబోతున్నారు అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

  1. పవన్ కళ్యాణ్

  గతేడాది గబ్బర్ సింగ్, కెమెరా‌మెన్ గంగతో ప్రేక్షకులను అలరించి పవన్ కళ్యాణ్...ఈ ఏడాది మాత్రం ఆ రేంజిలో జోరు చూపించడం లేదు. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు 10 నెలల సమయం పట్టనుంది.

  2. మహేష్ బాబు

  లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 'బిజినెస్ మేన్' చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన మహేష్ బాబు బొమ్మ...ఆ తర్వాత కనిపించలేదు. అయితే ఈ ఏడాది మాత్రం తప్పకుండా 2 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. వీలైతే మరో సినిమా కూడా ప్రేక్షుకల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మహేష్ నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా వేసవి తర్వాత విడుదల కానుంది.

  3. రామ్ చరణ్ తేజ్

  2012 సంవత్సరంలో 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన రామ్ చరణ్...ఈ ఏడాది ఏకంగా 3 సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా, బాలీవుడ్ లో చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రం ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రం కూడా ఇదే ఏడాది విడుదల కానుంది.

  4. జూ ఎన్టీఆర్

  గత సంవత్సరం 'దమ్ము' చిత్రంలో నటించిన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్...ఈ సంవత్సరం రెండు చిత్రాలు విడుదల చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'బాద్ షా' చిత్రంతో పాటు, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ సంవత్సరమే విడుదల కానున్నాయి.

  5. ప్రభాస్

  గతేడాది కేవలం 'రెబల్' చిత్రంలో మాత్రమే ప్రేక్షకులకు కనిపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...ఈ సంవత్సరం కూడా కేవలం ఒకే సినిమాను ప్రేక్షకులకు చూపెడుతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా కమిటైనప్పటికీ ఆ సినిమా ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశాలు లేవు.

  6. అల్లు అర్జున్

  గతేడాది 'జులాయి' సినిమాతో హిట్ కొట్టిన అల్లు అర్జున్...ఈ సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే విధంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాను పూర్తి చేసే అవకాశం కూడా ఉంది.

  7. వెంకటేష్

  'బాడీగార్డ్' సినిమాతో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం మినిమమ్ రెండు సినిమాలు ప్రేక్షకులకు చూపెట్టబోతున్నాడు. వెంకీ నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సంక్రాంతికి విడుదలవుతుండగా, ఈ సినిమా 100 పూర్తి కాకముందు 'షాడో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  8. బాలకృష్ణ

  గతేడాది శ్రీమన్నారాయణ, అధినాయకుడు, ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రాలు చేసిన బాలకృష్ణ...ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేసేట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలేవీ మొదలు కాలేదు.

  9. నాగార్జున

  కింగ్ నాగార్జున గతేడాది 'షిరిడి సాయి', 'డమరుకం'చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసాడు. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. నాగార్జున ఈ సంవత్సరం 'లవ్ స్టోరీ', 'భాయ్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  10. రవితేజ

  గతేడాది దరువు, నిప్పు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు చిత్రాలు చేసిన రవితేజ...ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయనున్నాడు. 'బలుపు'చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా, 'జింతాత జితా జితా' అనే ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది.

  11. అల్లరి నరేష్

  కామెడీ హీరో అల్లరి నరేష్ గతేడాది నువ్వానేనా, సుడిగాడు, యముడికి మొగుడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ ఏడాది నరేష్ యాక్షన్ 3డి, కెవ్వుకేక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీలేతై మరో సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

  12. నాని

  గతేడాది ఈగ, ఎటో వెళ్లి పోయింది మనసు చిత్రాలు చేసిన హీరో రాని...ఈ ఏడాది పైసా, జెండాపై కపిరాజు, బ్యాండ్ బాజా భారత్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  13. నాగ చైతన్య

  గత సంవత్సరం నాగ చైతన్య సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం 'ఆటో నగర్ సూర్య', 'భలే తమ్ముడు' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  14. సునీల్

  కామెడీ హీరోగా ఎదుగుతున్న సునీల్ గతేడాది 'పూల రంగడు' చిత్రంతో హిట్ కొట్టాడు. అయితే ఈ సంవత్సరం రెండు సినిమాలు తప్పకుండా విడుదల చేస్తానంటున్నాడు. అందులో ఒకటి 'మిస్టర్ పెళ్లికొడుకు' చిత్రం కాగా, మరొకటి 'సంబరాల రాంబాబు'.

  15.గోపీచంద్

  గతేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరో గోపీచంద్...ఈ ఏడాది 'జాక్ పాట్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  16. నితిన్

  చాలా కాలం తర్వాత గతేడాది 'ఇష్క్' చిత్రంతో హిట్ కొట్టిన హీరో నితిన్....ఈ సంవత్సరం కొరియర్ బాయ్ కళ్యాణ్, గుండెజారి గల్లంతయ్యిందే అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  17. వరుణ్ సందేష్

  హీరో వరుణ్ సందేష్ చిత్రం గతేడాది ఒక్కటి కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం అతని చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. చమ్మక్ చల్లో, అబ్బాయ్ క్లాస్ అమ్మాయి మాస్, డి ఫర్ దోపిడి, ట్విస్ట్ చిత్రాలతో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని విడుదలవుతాయో చూడాలి.

  English summary
  Tollywood actor new projects-2013 : Pawan Kalyan-Trivikram's Untitled Project, Mahesh Babu-Seethamma Vakitlo Sirimalle Chettu, Sukumar's Untitled Project, Ram Charan Teja-Zanjeer, Yevadu, Naayak, Varun Sandesh-Chammak Challo, Twist, Abbai Class Ammai Mass, D for Dopidi ect...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X