ఆ పని మాకు కాఫీ పెట్టినంత ఈజీ.. సాయి ధరమ్ తేజ్
రోదసిలోకి 104 ఉపగ్రహాలను పంపి ఇస్రో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్న నేపథ్యంపై ‘విన్నర్’ హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు.
మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. సినిమాలో నటిస్తునే సోషల్ మీడియాలో పలు విషయాలపై తన స్పందనను వ్యక్తం చేస్తుంటాడు.

తాజాగా రోదసిలోకి 104 ఉపగ్రహాలను పంపి ఇస్రో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్న నేపథ్యంపై ఈ 'విన్నర్' స్పందించారు. '100కు పైగా శాటిలైట్లను లాంచ్ చేయడం మాకు కాఫీ పెట్టినంత ఈజీ అని రుజువు చేసిన ఇస్రోకు థ్యాంక్స్. భారతీయులందరిని గర్వపడేలా చేసినందుకు ఆనందంగా ఉంది' అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
ఇటీవల రాష్ట్రంలోని అనాధలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత విద్య, వసతి ఏర్పాటు చేయాలని తీసుకొన్న నిర్ణయంపై కూడా మెగా అల్లుడు ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











