»   » ఈసారి నిజమైన పెళ్ళే... మన హీరోయిన్ కి ఇంకో మూడురోజుల్లో పెళ్ళి

ఈసారి నిజమైన పెళ్ళే... మన హీరోయిన్ కి ఇంకో మూడురోజుల్లో పెళ్ళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చిత్రసీమలో హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చకున్న నటి నిఖిత వివాహ వేడుక మొదలైంది. హాయ్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు డాన్‌,సంబరం,కళ్యాణ రాముడు,ఖుషిఖుషీగా,అనసూయ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్‌దీప్‌ సింగ్‌ మగోతో నిఖిత వివాహం ఈ దసరాకి జరగనుందని ఆమె స్వయంగా తెలిపారు. ఈ వివాహ వేడుక రేపటి నుంచే ప్రారంభం కానుందట.

"సంబరం", ఖుషీ ఖుషీగా, "ఏమండోయ్ శ్రీవారు", "నీ నవ్వేచాలు" వంటి చిత్రాల్లో నటించిన నిఖిత... ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుంది. అయితే గతం లో ఒకసారి నిఖిత కన్నడ హీరో దర్శన్ ను పెళ్లి చేసుకుందన్న వార్త గుప్పుమంది. అప్పటికే దర్శన్ కి పది సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. దర్శన్, నిఖిత సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్నారన్న రూమర్ తోపాటు.

Tollywood Actress Nikitha ready to Wed

కన్నడలో చాలా బిజీగా వున్న నిఖితకు దర్శన్ ముంబైలో ఒక ప్లాట్ కూడా కొన్నాడని చెప్పుకున్నారు. అయితే వాళ్లిద్దరు తాము పెళ్లిచేసుకున్నామన్న వార్తలో ఎంత మాత్రం నిజంలేదని.,ఇద్దరూ కలిసి నటిస్తున్న 'ప్రిన్స్" అనే సినిమాలో ఓ పెళ్ళి సీన్ లో నటించామని, ఆ కాస్ట్యూమ్స్ లో వున్న ఫోటోలతో ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ వివాదానికి తెరదించేసారు. మళ్ళీ ఇన్నాళ్ళకి తన నిజమైన పెళ్ళి కి సిద్దమైందీ క్య్య్ట్ హీరోయిన్.

కాంగ్రెస్‌నేత, వ్యాపారవేత్త అయిన మహీందర్‌ సింగ్‌ మగో కుమారుడే ఈ గగన్‌సింగ్‌. గగన్ గురించి నిఖిత తెలుపుతూ.. గత ఏడాది డిసెంబరులో నా కజిన్‌ వివాహంలో మొదటసారి గగన్‌ని కలిశానని చెప్పింది. అప్పుడే అతడు నన్ను ఇష్టపడ్డాడని చెప్పుకొచ్చింది. గగన్ కూడా నా సోదరిని అడిగే నాతో మాట్లాడాడని ఆమె చెప్పింది. నేను హోమ్లీగా ఉండడంతో అతడు నన్ను ప్రేమించాడు. అదే రోజు నాకు తన ప్రేమ విషయం కూడా చెప్పాడు. నా భావాలను గగన్‌ అర్థం చేసుకుని నా కోసం వాళ్ల ఇంట్లో ప్రత్యేకంగా ఓ పూజ గదిని ఏర్పాటు చేశాడు. అతడే నాకు కాబోయే భర్త, అతడు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. ముంబయి రెస్టారెంట్‌లో మోకాలిపై నిలబడి డైమెండ్‌ రింగ్‌తో నాకు తన ప్రపోజ్‌ చేశాడు' అని నిఖిత చెప్పింది.

English summary
Actress Nikhitha reveals to us that she is getting married to Mumbai based industrialist Gagandeep Singh Mago this weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu