twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్లో అడల్ట్ కంటెంట్ జోరు: సినిమా అంటే సెక్స్ సీన్లు, బూతు డైలాగులు, ముద్దుసీన్లేనా?

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో రోజు రోజుకు అడల్ట్ కంటెంట్ ఎక్కువ అయిపోతోందని, యువత చెడుదారి పట్టే విధంగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో శృతిమించిన బూతు కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు జొప్పిస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. సినిమాలపై హైప్ క్రియేట్ చేయడానికి కొందరు దర్శకులు ఎంత నీచానికైనా దిగజారడానికి వెనకాడటం లేదనేది కాదనలేని వాస్తవం. ఇలా చేస్తున్నారేంటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఇది క్రియేటివ్ జాబ్, మా క్రియేటివిటీ ఇలాగే ఉంటుంది అంటూ అడ్డంగా వాదించే దర్శకులకు చాలా మందే ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొసాగితే తెలుగు సినిమాల్లో ఇంకెన్ని దారుణమైన టీజర్లు, రోత పుట్టించే పోస్టర్లు చూడాల్సి వస్తుందో అని సగటు ప్రేక్షకుడు ఆందోళన చెందుతున్నాడు.

    ఆ తేడాను చాలా మంది గమనించడం లేదు

    ఆ తేడాను చాలా మంది గమనించడం లేదు

    ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే కొత్త దర్శకులు ఎన్నో క్రియేటివ్ థాట్స్‌తో, మంచి కంటెంటుతో తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కథ డిమాండ్ మేరకు ముద్దు సీన్లు, శృంగార సీన్లు పెట్టి ఉండొచ్చు. అయితే ఆ సినిమాలు విజయం సాధించడానికి ప్రధాన కారణం మంచి కంటెంటే కానీ... ఆ సీన్లు ఏమాత్రం కాదు. కళాత్మక కోణానికి, అశ్లీలకు మధ్య ఉండే తేడా ఒక చిన్న గీత మాత్రమే. ఈ తేడా గమనించడంలో కొందరు దర్శకులు విఫలం అవుతున్నారు.

    యువతకు గాలం వేసి ఓపెనింగ్స్ రాబట్టుకోవడమే లక్ష్యంగా

    యువతకు గాలం వేసి ఓపెనింగ్స్ రాబట్టుకోవడమే లక్ష్యంగా

    గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 లాంటి చిత్రాలు విజయం సాధించడంతో.... వాటిని స్పూర్తిగా తీసుకుని కాస్త ఘాటైన కంటెంట్ ఉంటే చాలు డబ్బు వర్షం కురుస్తుందని ఆలోచించే వారి సంఖ్య పెరిగిపోయింది. బూతు సీన్లతో కూడిన ట్రైలర్ విడుదల చేయడం ద్వారా హైప్ క్రియేట్ చేసి ఓఫెనింగ్స్ దండుకోవడమే లక్ష్యంగా కొందరు సినిమాలు తీస్తున్నారు.

    వింతవాదనలూ చేసేవారు తక్కువేం కాదు

    వింతవాదనలూ చేసేవారు తక్కువేం కాదు

    మరికొందరు దర్శక నిర్మాతలైతే ఇలాంటి అడల్ట్ కంటెంట్ విషయంలో వింత వాదన వినిపిస్తుండటం గమనార్హం. మాది చిన్న సినిమా... పేరున్న నటులూ ఎవరూ లేరు, అంతా కొత్త వారితో తీశాం, కాస్త గిట్టుబాటు కావాలికదా, ఆ సీన్లు లేకుంటే ఎవరు వస్తారు అంటూ బూతు కంటెంటును క్యాష్ చేసుకోవడానికే తాము సినిమాలు తీస్తున్నామని పరోక్షంగా చెబుతున్నారు.

    సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది రోజు రోజుకు తగ్గిపోతోంది

    సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది రోజు రోజుకు తగ్గిపోతోంది

    శృంగార భంగిమలతో ఉన్న పోస్టర్లు, లిప్ లాక్ సీన్లు, సెక్స్ సీన్లతో టీజర్ రిలీజ్ చేసి.... యువతలో తప్పుడు ఆలోచనలు కలిగించే విధంగా క్యాప్షన్లు పెడుతూ వికృత చర్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య సైతం పెరిగిపోతోంది. అడల్ట్ కంటెంటుతో సొమ్ము చేసుకోవాలనే ఆలోచనే తప్పితే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది రోజు రోజుకు తగ్గిపోతోంది.

    సగటు తెలుగు సమాజం యాక్సెప్ట్ చేయలేని స్థాయిలో అశ్లీలం

    సగటు తెలుగు సమాజం యాక్సెప్ట్ చేయలేని స్థాయిలో అశ్లీలం

    ఈ మధ్యకాలంలో వచ్చిన చీకటి గదిలో చితక్కొట్టుడు, ఏడు చేపలకథ, డిగ్రీ కాలేజ్, నేను లాంటి చిత్రాల పోస్టర్ల, టీజర్లు చూసిన సాంప్రదాయ తెలుగు ప్రేక్షకులడు షాకయ్యారు. అయితే యువత నుంచి మాత్రం వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పు ఒప్పుల సంగతి పక్కన పడితే... సగటు తెలుగు సమాజం యాక్సెప్ట్ చేయలేని అశ్లీలం వీటిలో ఉందనేది వాస్తవం.

    సభా ముఖంగా ఏకి పారేసిన జీవిత

    సభా ముఖంగా ఏకి పారేసిన జీవిత

    ఇటీవల డిగ్రీ కాలేజ్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటుకు వెళ్లిన నటి జీవిత ట్రైలర్ చూసి అవ్వాక్కయారు. అంతా అశ్లీలంతో నిండి ఉండటంతో ఆమె సభా ముఖంగా దర్శక నిర్మాతలను అక్కడే ఏకి పారేశారు. ఇలాంటి సినిమాల సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో తెలుగు సినిమా స్థాయి తగ్గుతుందా? పెరుగుతుందా? కాలమే నిర్ణయించాలి.

    English summary
    Tollywood Adult content on the aggressive level. Recent release Cheekati Gadhilo Chithakkottudu has set a bar for sleazy stuff. Upcoming movies like Yedu Chepala Katha, Degree College etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X