»   » చిరు కూతురుతో గొడవ: పరిస్థితి మరింత దిగజారింది, నిషేధం?

చిరు కూతురుతో గొడవ: పరిస్థితి మరింత దిగజారింది, నిషేధం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ కేథరిన్... ఆమెకు తెలుగులో వస్తున్న అవకాశాలే తక్కువ అంటే తన పొగరుబోతు ప్రవర్తనతో చేతిదాకా వచ్చిన అవకాశాలను చేజార్చుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగులో ఆమె సంవత్సరానికి ఒక సినిమాలో నటించడమే గగనం అయిపోయింది. మూడేళ్ల క్రితం బన్నీతో చేసిన ఇద్దరమ్మాయిలతో చిత్రం తర్వాతే కేథరిన్‌కు గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో అమ్మడు హాట్ హాట్ గా కనిపించడంతో ఆ తర్వాత అవకాశాలు వస్తాయని భావించినా అలాంటిదేమీ జరుగలేదు. కారణం తర్వాతి సంవత్సరం ఆమె చేసిన పైసా, ఎర్రబస్ చిత్రాలు బాక్సాపీసు వద్ద పెద్ద ప్లాప్ కావడమే.

రుద్రమదేవి మూవీలో కీలకమైన పాత్రలో నటించిన ఆమె... ఈ సంవత్సరం బన్నీ నటించిన 'సరైనోడు' మూవీలో నటించింది. బన్నీ సహకారంతో చిరంజీవి 150వ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చినా తన ప్రవర్తనతో అవకాశం కోల్పోయింది.

 చిరు కూతురు సుష్మితతో గొడవ

చిరు కూతురు సుష్మితతో గొడవ

చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం.150 చిత్రానికి చిరు కూతురు సుష్మిత కాస్టూమ్ డిజైనర్ గా చేస్తోంది. అయితే కాస్టూమ్స్ విషయంలో చిరంజీవి కూతురుతో కేథరిన్ గొడవ పడిందట. దీంతో వెంటనే ఆమెను సినిమా నుండి తప్పించారు.

 పొగరుబోతు తనమా?

పొగరుబోతు తనమా?

చిరంజీవి లాంటి పెద్ద స్టార్ తో చేసే సమయంలో అదుపులో ఉండాల్సిన విషయం మరిచిపోయి..... సెట్స్ లో గొడవ చేయడం లాంటివి చేస్తే ఏం జరుగుతుందో ఆమెకు ఇప్పుడు అర్థమైందని, ఇప్పటికైనా ఆమె తన పొగరుబోతు ఆటిట్యూడ్ మార్చుకోవాలని అంటున్నారు.

 ఆమెతో ఇబ్బందే

ఆమెతో ఇబ్బందే

అయితే కేథరిన్ తో ఇబ్బందే అని ఆమెతో గతంలో పని చేసిన ఫిల్మ్ మేకర్స్ అంటున్నారు. సెట్స్ కు, సినిమా ఫంక్షన్స్ కు ఆమె సమయానికి రాదని, ఆమెతో షోలు ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయని టాక్.

 నిషేదం..?

నిషేదం..?

క్రమ క్రమంగా కేథరిన్ అంటే... టాలీవుడ్లో ఎవరికీ నచ్చడం లేదని, ఆమెతో సినిమాలు, లేదా ఏదైనా కార్యక్రమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, తాజాగా చిరంజీవి కూతురుతో గొడవ తర్వాత చాలా మంది ఆమెను తీసుకోవడానికి కూడా భయ పడుతున్నారని, అనధికారికంగా ఆమెపై నిషేదం అమలులోకి వచ్చినంత పరస్థితి కనసాగుతోందని అంటున్నారు.

English summary
Telugu filmmakers and stars aren't considering Catherine for their future ventures, if she won't change her attitude towards co-stars and technicians.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu