బుద్దిలేని గాడిదలు అంటూ వేణు మాధవ్ ఫైర్
హైదరాబాద్: తాను చనిపోయినట్లు ప్రచారం చేస్తుండటంపై తీవ్ర మనస్తాపానికి గురైన ప్రముఖ తెలుగు కమెడియన్ వేణు మాధవ్ ఇటీవల ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని వేణు మాధవ్ సీరియస్ గానే తీసుకున్నారు.
ఈ విషయమై ఆయన ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రులునాయిని, తలసానిలను కలిసారు. త్వరలో గవర్నర్ ను కూడా కలుస్తానని, తనపై జరుగుతున్న అసత్యం ప్రచారంపై ఫిర్యాదు చేస్తానని వేణు మాధవ్ వెల్లడించారు.

ఆదివారం హన్మకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఫైర్ అయ్యారు. కొందరు బుద్దిలేని గాడిదలు పనిలేక తనపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వేణు మాధవ్ స్పష్టం చేసారు.
తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరానని వేణు మాధవ్ తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం వల్ల తనతో పాటు తన అభిమానులు కూడా మనస్తాపానికి గురయ్యారని వేణు మాధవ్ ఆవేదన వెలుబుచ్చారు.


Click it and Unblock the Notifications











