»   » రచ్చరవి తో బ్రహ్మానందం "కత్తిరెడ్డి" : స్పూఫ్ ల సినిమా అయితే కాదు కదా..!?

రచ్చరవి తో బ్రహ్మానందం "కత్తిరెడ్డి" : స్పూఫ్ ల సినిమా అయితే కాదు కదా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్ర‌హ్మానందం నిన్నా మొన్నటి వరకూ తెలుగు సినిమాకి అనధికరిక హీరో, కొన్ని సినిమాలు కేవలం బ్రహ్మీ కామెడీ తోనే గట్టెక్కాయి కూడా. పోస్టర్ ఫై ఆయన కనిపిస్తే చాలు థియేటర్ కు పరుగులు పెట్టేవారు. బ్ర‌హ్మానందం ఉంటె సినిమా హిట్ అని దర్శక నిర్మాతలు సైతం నమ్మేవారు..కానీ ప్రస్తుతం బ్రహ్మానందం జోరు బాగా తగ్గింది. ఇదివరకు ఇచ్చినట్టుఅవకాశాలుకూడా ఎవ్వరు ఇవ్వడం లేదు, యువ కమెడియన్లతో పొటీ పెరగటం, బ్రహ్మీ అడిగే రెమ్యునరేషన్ ఎక్కువగా ఉందటం కూడా కారణం అయి ఉండవచ్చు గానీ మొత్తానికి తెలుగు తెర బ్రహ్మీ ని కొంచం దూరం పెట్టిన మాట మాత్రం నిజం..

Tollywood comedy King Brahmanandam in and as Katti Reddy

ఇలాంటి సమయం లో ఈ నిన్నటి నవ్వుల రాజు లీడ్ రోల్ గా "కత్తి రెడ్డి" అంటూ ఓ ప్రాజెక్ట్ పై అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాలో బ్రహ్మానందం టైటిల్ రోల్ చేయనుండగా.. రచ్చరవి పవర్ ఫుల్ యాక్షన్ తో నవ్వులు పూయించేస్తాడట. కత్తి రెడ్డికి 'ఎత్తితే దించడు' అనే ఓ ఫన్నీ ట్యాగ్ లైన్ కూడా ఉంది. ప్రస్తుతం కెరీర్ లోనే ఎన్నడూ ఫేస్ చేయని కీలకమైన దశలో ఉన్న బ్రహ్మానందం.. కత్తి రెడ్డిగా ఎలా అలరిస్తాడనే సంగతి ఆసక్తి కలిగిస్తోంది. కానీ ఎక్కడ అన్ని ఫ్యాక్షన్ సినిమాలను కలిపి ఒక స్పూఫ్ ల సినిమా చేసేస్తారేమో అన్న భయం కూడా ఉందనుకోండీ. మరి అంతటి ధారుణమైన ప్రయోగం మళ్ళీ చేయరనే నమ్మకం తోనే ఉన్నారు ప్రేక్షకులు. జబర్దస్ ఫేమ్ రచ్చ ర‌వి కీ రోల్ పోషించ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తార‌ని తెలుస్తుండ‌గా, క‌త్తి రెడ్డిగా బ్ర‌హ్మానందం ఎలా మెప్పిస్తాడో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ కి వెళ్ల‌నుంది.

English summary
Jabardast Comedy actor Racha ravi and Brahmanandam playing lead roles in Katti Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu