పేలుళ్లను ఖండిస్తూ సినీ సెలబ్రిటీల ట్వీట్లు

By Bojja Kumar

Shruti Hassan-Harish Shankar
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్ల ఘటనను తెలుగు సినీ ప్రముఖులంతా ముక్త కంఠంతో ఖండించారు. మృతులకు కుంబాలకు సంతాపం తెలిపారు. అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు కొందరు తమ తమ మైక్రోబ్లాగింగ్‌లో కామెంట్స్ చేసారు.

రామ్ గోపాల్ వర్మ:
అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని తీవ్ర వాదులు దాడులు జరుపుతున్నారు. అమాయక ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే వారి లక్ష్యం...

లక్ష్మి మంచు:
బాంబు పేలుళ్ల ఘటన నన్నెంతో బాధించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాడ సంతాపం. ఇది ద్వేషం-ప్రేమకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ అందమైన దేశం యొక్క పౌరులుగా మనం ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలి.

శృతి హాసన్:
అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. హైదరాబాద్‌లో ఉన్న వారంతా బాగుండాలని కోరుకుంటున్నాను.

హరీష్ శంకర్:
హైదరాబాదీలంతా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుకుంటున్నాను. దొంగ దెబ్బతీసే పిరికి వారి చేతిలో ఓడిపోకూడదు. ఇలాంటి సమయంలోనే అంతా ఐక్యంగా ఉండాలి.

తమన్:
హైదరాబాద్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు సంభవించడం చాలా బాధాకరం. బాధితుల కుటుంబాలు ఎంతో బాధతో ఉన్నాయి. దేవుడు అందరినీ బాగా చూడాలి.

తాప్సీ: షూటింగులో ఉన్నా. సడెన్‌గా ఫోన్లు అన్నీ బిజీ అయిపోయాయి. ఏమిటని ఆరాతీస్తే బాంబు పేలుళ్ల విషయం తెలిసింది. ఎంతో షాకయ్యాను.

రూపా వైట్ల:
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు. రెడ్ అలర్ట్...అంతా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. టీవీల్లో బాంబ్ బ్లాస్ట్ విజువల్స్ చూసి షాకయ్యాను. అమాయక ప్రజలను దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను.

దేవిశ్రీ ప్రసాద్:
బాంబు పేలుళ్ల ఘటన నన్ను ఎంతో బాధించింది. అందరికీ మంచి జరుగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X