»   » టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్: ఇతగాడు నిజంగానే ‘కేటుగాడు’

టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్: ఇతగాడు నిజంగానే ‘కేటుగాడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు దర్శకుడు నల్లూరి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసాడు. పాతనోట్ల మార్పిడి కేసులో ప్రమేయం ఉందనే కారణంతో పోలీసులు ఇతగాడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రామకృష్ణతో పాటు మరో 10 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరంతా డిమోనిటైజేషన్ సమయంలో రూ. 1.2 కోట్లు విలువ చేసే నోట్లను అక్రమంగా మార్పిడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

మార్చిలో దర్శకుడు రామకృష్ణ కార్యాలయంపై పోలీసులు రైడ్ చేయగా.... అతడు అక్కడి నుండి పరారయ్యాడు. అతడి సెల్ ఫోన్ కాల్ సిగ్నల్స్, లోకేషన్ ఆధారంగా ఖమ్మం జిల్లాలో అరెస్టు చేసారు.

Tollywood director arrested in Currency exchange racket

తెలుగులో వచ్చిన 'కేటుగాడు' సినిమాకు రామకృష్ణ దర్శకత్వం వహించారు. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

English summary
Police arrested Tollywood director Ramakrishna who was involved in a currency exchange racket. Ketugadu fame Nalluri Ramakrishna and 10 others attempted to exchange demonetised currency worth Rs 1.2 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu