కెల్విన్ వాట్సప్‌లో వందల మెసేజ్‌లు.. నా తండ్రి మరణంతో విషాదంలో ఉంటే ఇదేంటి?.. తనీష్

హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్ రాకెట్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు.

By Rajababu

హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్ రాకెట్ కేసులో టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. డ్రగ్ రాకెట్‌ ముఠాకు చెందిన కెల్విన్ అరెస్ట్ తర్వాత 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, రవి తేజ, చార్మీ కౌర్, శ్యాం కే నాయుడు, రవి తేజ డ్రైవర్, ముమైత్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో నోటీసులు అందుకొన్న 11వ వ్యక్తిగా తనీష్ సిట్ ముందు హాజరయ్యాడు.

డ్రగ్ కేసులో పేరుపై ఆందోళన

డ్రగ్ కేసులో పేరుపై ఆందోళన

డ్రగ్స్ వ్యవహారంలో తన పేరు జాబితాలో ఉండటంపై తనీష్ ఆందోళన వ్యక్తం చేశాడు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్‌లో కొన్నేండ్లుగా ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి వివాదంలో ఇరుక్కోలేదని ఆయన చెప్పాడు.

Recommended Video

Hyderabad drugs Case : Puri Jagannadh appears before SIT
తండ్రి మరణంతో కుంగిపోయాను..

తండ్రి మరణంతో కుంగిపోయాను..

ఇటీవలనే నా తండ్రి స్వర్గస్తులయ్యాడు. ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంటికి పెద్ద కొడుకుగా అనేక బాధ్యతలు నాపై పడ్డాయి. దాంతో సమాజపరమైన బంధాలను కూడా తగ్గించుకొన్నాను. కనీసం విందులు, వినోదాలకు దూరమయ్యాను. కెరీర్‌ను మళ్లీ చక్కబెట్టుకొనేందుకు కష్ఠపడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో డ్రగ్ మాఫియాలో నా పేరు బయటకు రావడం షాక్ గురిచేసింది అని తనీష్ అన్నారు.

ఆందోళనలో నా కుటుంబం

ఆందోళనలో నా కుటుంబం

డ్రగ్స్ కేసు గురించి తెలిసినప్పటి నుంచి నా కుటుంబం చాలా ఆందోళనకు గురవుతున్నది. ఓ రకమైన భయం వారిని వెంటాడుతున్నది. నాకు ఈ వ్యవహారంతో సంబంధం లేకుండానే నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అయినా నోటీసుల వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారణకు హాజరయ్యాను అని మీడియాతో పేర్కొన్నారు.

కెల్విన్ కాల్ లిస్టులో తనీష్..

కెల్విన్ కాల్ లిస్టులో తనీష్..

కెల్విన్‌తో సంబంధాలున్నాయన్న ఆధారాలతో తనీష్‌కు నోటీసులు జారీ చేశామని సిట్ అధికారులు పేర్కొన్నారు. కెల్విన్ కాల్ లిస్టులో తనీష్ పేరు ఉందని, వందల మెసేజ్‌లు వాట్సాప్‌లో కనిపించాయి. దాదాపు వందకు పైగా వాట్సాప్ మెసేజ్‌లు తనీష్ నుంచి కెల్విన్‌కు వెళ్లినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. కెల్విన్‌తో నేరుగా సంబంధాలున్నాయని కూడా తనీష్‌పై ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X