»   » రవితేజ తమ్ముడి ఫోన్ కీలక పాత్ర: భరత్ రాజు కాల్స్ ఆధారంగానే కదిలిన డ్రగ్స్ డొంక ?

రవితేజ తమ్ముడి ఫోన్ కీలక పాత్ర: భరత్ రాజు కాల్స్ ఆధారంగానే కదిలిన డ్రగ్స్ డొంక ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం కొత్తేమీ కాదు. చాలాకాలం నుంచే ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల వ్యవహారం నడుస్తోందన్న ప్రచారం ఉంది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుండటంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, నిర్మాతలు తొలిసారి మీడియా సమావేశం పెట్టారు. పది, పదిహేను మంది వల్లే సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నవారి పేర్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఇప్పటికైనా వాళ్లు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. లేకుంటే తరువాత జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఫైరింగ్ స్టార్ట్

ఫైరింగ్ స్టార్ట్

ఒక పక్క ఎక్సైజ్ శాఖ వరుసపెట్టి ఒక్కొక్కరినీ ఫైర్ చేసుకుంటూ వెళ్తోంది. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ తాజాగా ఓ ప్రముఖ హీరో, టాప్ డైరెక్టర్, ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ లోపు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు.

Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
యువహీరోలు, హీరోయిన్లు

యువహీరోలు, హీరోయిన్లు

వీరిలో యువహీరోలు నవదీప్, తరుణ్, హీరోయిన్లు చార్మి, ముమైత్‌ఖాన్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యాం కే నాయుడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నా, సుబ్బరాజు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిని వారంలోగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం.

టాలీవుడ్ పై నిఘా

టాలీవుడ్ పై నిఘా

డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ నిందితుల కాల్‌డాటాను పరిశీలించగా, లభించిన ఆధారాలతో అధికారులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. నిన్నటివరకు విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై దృష్టిపెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. ఇప్పుడు టాలీవుడ్ పై నిఘాపెట్టారు.

చిత్రసీమలోని పెద్దలతో చర్చించి

చిత్రసీమలోని పెద్దలతో చర్చించి

డ్రగ్స్ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి, అందులో నలుగురు కీలక అధికారులను నియమించింది. అధికారుల బృందం ఇప్పటికే చిత్రసీమలోని పెద్దలతో చర్చించి, తాజాగా నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది.

భరత్ రాజు కాల్స్ లిస్ట్

భరత్ రాజు కాల్స్ లిస్ట్

మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు, తరచూ తీసుకునేవారి వివరాలను అధికారులు సేకరించారు. రంగాలవారీగా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధం ఉన్నవారిని పిలిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ టాలీవుడ్ డొంక మొత్తం కదలటానికి వెనుక కొద్ది రోజుల క్రితమే రోడ్డు ప్రమాదం లో మరణించిన రవితేజ సోదరుడు భరత్ రాజు కాల్స్ లిస్ట్ తీగ కారణం అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

భరత్ రాజు సెల్ ఫోన్

భరత్ రాజు సెల్ ఫోన్

భరత్ రాజు మరణానంతరం ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న డ్రగ్ సప్లయర్ల నంబర్లనీ, అదే రాకెట్ లో ఉన్న సినీ నటుల వివరాలనీ బయటికి లాగారు అని చెప్పుకుంటున్నారు. నోటీసులు వెళ్లిన సినీ ప్రముఖులు సిట్ ముందు హాజరు కావాల్సిందేనని ఉన్నతాధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. సినీ ప్రముఖుల చిట్టా ఇంకా పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

English summary
Tollywood Drug mafia links exposed after Hero Raviteja Brother bharath Raju's death? police Find out the links from Bharat Raju's cell phone
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu