Just In
- 3 min ago
ఫైనల్ గా డ్రీమ్ ప్రాజెక్టును మొదలు పెట్టిన హీరో నిఖీల్!
- 8 min ago
వాటికి నువ్ అర్హుడివే.. ‘పొగరు’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్
- 21 min ago
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 47 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
Don't Miss!
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
పిచ్‌ను నిందించిన మాజీ క్రికెటర్లపై అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు!
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం.. సినీ ప్రముఖుల సంతాపం

హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మేకా పరమేశ్వరరావు (70) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. గత అర్థరాత్రి మరణించారు. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొన్ని నెలలుగా ఆ వ్యాధితో..
శ్రీకాంత్ తండ్రి మేకా పరమేశ్వరరావు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మేరకు నాలుగు నెలలుగా స్టార్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన గత రాత్రి (ఆదివారం 11 గంటల 45 నిమిషాలకు) కన్నుమూశారు.

స్వగ్రామం.. కుటుంబ వివరాలు
1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలెంకు వలస వెళ్లారు. ఆయన భార్య పేరు ఝాన్సీ లక్ష్మి. కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్.

పలువురు సినీ ప్రముఖుల సంతాపం.. అంత్యక్రియలు
శ్రీకాంత్ తండ్రి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో పరమేశ్వరరావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.