»   » అక్కినేని ఫ్యామిలీలో విషాదం: రారండోయ్ వేడుక రద్దు!

అక్కినేని ఫ్యామిలీలో విషాదం: రారండోయ్ వేడుక రద్దు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది. నాగార్జున మేనల్లుడు, హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు గురువారం కన్నుమూసారు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరుగాల్సిన అక్కినేని నాగ చైతన్య మూవీ 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుక రద్దయింది.

అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, నాగార్జున సోదరి నాగ సుశీలను అనుమోలు సత్యభూషణ రావు వివాహ మాడారు. అయితే నాగ భూషణరావు గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేసే వారని, సినిమా ఫంక్షన్లకు దూరంగా ఉండే వారని తెలుస్తోంది.

అనుమోలు సత్య భూషణ్ రావు

అనుమోలు సత్య భూషణ్ రావు

గుండె పోటు కారణంగా సత్యభూషణరావు మరణించినట్టు తెలుస్తోంది. అనుమోలు సత్య భూషణ్ రావు మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం నెలకొంది.

వ్యాపారం

వ్యాపారం

సినిమా వేడుకల్లో ఎక్కువగా నాగ సుశీల, సుశాంత్ మాత్రమే కనిపించే వారు. సత్యభూషణరావు వ్యాపారం చేసేవారని, ఆయన తన పనుల్లో బిజిగీ ఉండే వారని, అందుకే సినిమా వేడుకలకు వీలైనంత దూరంగా ఉండేవారని అంటున్నారు.

ఫ్యామిలీ మొత్తం

ఫ్యామిలీ మొత్తం

సత్యభూషణరావు మరణ వార్త తెలుసుకున్న వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్కినేని కుటుంబీకులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం సత్యభూషణరావు అంత్యక్రియలు జరిగే అవాకాశం ఉంది.

రారండోయ్ వేడుక రద్దు

రారండోయ్ వేడుక రద్దు

అక్కినేని నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం' సినినిమా ఆడియో వేడుక గురువారం సాయంత్రం జరుగాల్సి ఉంది. అయితే సత్యభూషణరావు హఠాన్మరణంతో ఈ వేడుకను రద్దు చేసారు.

English summary
Tollywood Hero Sushanth Father Satya Bhushana Rao passed away this morning after suffering a cardiac arrest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu