»   » హీరోయిన్ లయకు యాక్సిడెంట్

హీరోయిన్ లయకు యాక్సిడెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్వయంవరం చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమై తర్వాత వరస పెట్టి సినిమాలు చేసిన విజయవాడ అమ్మాయి లయ. ఆమె ఆ మధ్యన 2006లో ఓ ఎన్నారైని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమెకు యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయినట్లు తెలుస్తోంది.

 Tollywood Heroine Laya met with an accident

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కుటుంబ సభ్యులతో కలిసి లాస్ ఏంజిల్స్ కు వెలుతుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. అయితే లయకు ఓ మోస్తరు గాయాలయ్యాయని, ఆమెకు ప్రాణానికి ప్రమాదం లేదని తెలుస్తోంది. దగ్గర్లోని హాస్పటిల్ కు తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఆమెకు చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని సమాచారం. మిగతా కుటుంబ సభ్యుల పరిస్ధితి ఏమిటన్నది తెలియరాలేదు. ఇక వివాహం చేసుకున్న తర్వాత లయ...సినిమాలు వైపు చూడలేదు. మధ్య మధ్యలో కొన్ని టీవి కార్యక్రమాల్లో మాత్రం కనిపించింది. 2008లో ఓ పాపకు జన్మ ఇచ్చింది. ఆ పాపకు శ్లోక అనే పేరు పెట్టింది.

English summary
Tollywood Heroine Laya was involved in an car accident and is suffering injuries. She met with a car accident, and she is being treated in a private hospital in the USA. The accident occurred while she was travelling to Los Angeles.
Please Wait while comments are loading...