»   » అనుష్క టు ఛార్మి దాన్నే నమ్ముకున్నారు(ఫోటో పీచర్)

అనుష్క టు ఛార్మి దాన్నే నమ్ముకున్నారు(ఫోటో పీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో మహిళా చిత్రాలు కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదనే వాదనకు చెక్ చెప్తున్నారు మన హీరోయిన్స్. ఈ మహిళా చిత్రాలన్నీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలుగా కూడా పిలుస్తారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళా ఇతివృత్తాలు, మహిళల చుట్టూ తిరిగే కథాంశాలతో కూడిన ఈ చిత్రాలకు ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. తెలుగు సినిమా ప్రారంభదశలో పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘికంలాంటి అన్ని కేటగిరీలలో కూడా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు వచ్చాయి. సతీ అనసూయ, సతీ సావిత్రి, శ్రీలక్ష్మమ్మ కథ, అనార్కలి, మల్లీశ్వరి లాంటి అనేక సినిమాలు మహిళా చిత్రాలుగానే పేర్కొనవచ్చు.

  గత ఆయిదు సంవత్సరాల కాలంలో వచ్చిన చిత్రాల్ని పరిశీలిస్తే మంత్ర, అనసూయ, అరుంధతి, బతుకమ్మలాంటి చాలా తక్కువ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ నాలుగు సినిమాలు విజయాలు సాధించాయి. అరుంధతి మాత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం కథానాయిక ప్రధాన చిత్రాలు అస్సలు రావడంలేదనే చెప్పుకోవాలి.


  హీరోకి ఇవ్వాల్సిన పారితోషికంతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం నిర్మించవచ్చు అనే ఉద్దేశ్యంతో మార్కెట్ కూడా బాగుంటుందన్న ఆశతోనే నిర్మాతలు ఇటువంటి చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం మంచి ఊపుమీద ఉన్న అనుష్క, నయనతార, ప్రియమణిలు అలాంటి పాత్రలను అంగీకరించడంతో ఈ తరహా చిత్రాలకు డిమాండ్ వచ్చింది. దాంతో నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు పెరిగింది.


  హీరోయిన్ల టాలెంట్‌ను ఉపయోగించుకోకుండా కేవలం వాళ్లను పాటలకే ఉపయోగించుకుంటున్నారు నేటి నిర్మాతలు. అప్పుడప్పుడు అరుంధతి , మంత్ర లాంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు వచ్చినా...ఎంతగా కలెక్షన్లను రాబట్టినా మన దర్శకనిర్మాతలు హీరోలపైనే కోట్లకు కోట్లు వెచ్చిస్తూ...వాళ్ల డేట్ల కోసం పడిగాపులు గాస్తూ సినిమాలను లేట్‌గా విడుదలచేస్తూ ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెంచేస్తుంటారు.

  సినిమాకు ఏ మాత్రం నెగెటివ్‌ టాక్‌ వచ్చినా నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టాలు చవిచూస్తుంటారు. హీరోయిన్లు పోటీపడి నాభికేంద్రాలను చూపిస్తూ సగటు ప్రేక్షకులకు ఆనందం పంచే వస్తువులుగానే మిగిలిపోతున్నారు తప్ప తమ పాత్రలు,వాటి స్వభావం మీద దృష్టిని కేంద్రీకరించడంలేదన్నది జగమెరిగిన సత్యం. ఈ నేపద్యంలో హీరోయిన్స్ కొంతలో కొంత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారు.

  లేటెస్ట్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు స్లైష్ షో లో..

  ఛార్మి

  ఛార్మి

  అనుకోకుండా ఒక రోజు, మంత్ర వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను పూర్తిగా తనే మోసి, విజయం సాధించిన ఛార్మి... ఈ మధ్య కాలంలో హిట్స్ లేక, హీరోల ప్రక్కన ఛాన్స్ లు లేక పూర్తిగా వెనకపడింది. అడపా దడపా ప్రేమే ఒక మైకం లాంటి సినిమాలతో పలరించినా అవి ఆశించిన ఫలితం దక్కటం లేదు. నిజానికి ‘మంత్ర' చిత్రంతో ఛార్మి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓ బ్రాండ్‌గా మారింది. ఆ చిత్రంతో టాప్ హీరోయిన్‌గా ఎదిగి ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఎస్.వి.సతీష్ దర్శకత్వంలో తేజ ఫిలింస్ పతకంపై నిర్మిస్తున్న ‘మంత్ర-2' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

  త్రిష

  త్రిష

  చెన్నై ముద్దుగుమ్మ త్రిష ఇప్పటి వరకూ పూర్తి గ్లామరస్ మరియు అభినయం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ గత 10 సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో మునుపటికంటే సినిమా చాన్సులు తగ్గినా తనకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటివరకూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయని త్రిష త్వరలోనే నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా చేయనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు. త్రిషకి తెలుగులో బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. రమ్ అనే టైటిలప్ తో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ గ్లామరస్ గా మెప్పించిన త్రిష నటిగా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

  నయనతార

  నయనతార

  ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలంటే మక్కువ చూపిన నయనతార తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ అంటే ఆసక్తి చూపుతోంది. అరుంధతి హిట్టవటంతో ఆమె కూడా అదే దారిలో ప్రయాణం చేసి పేరు సంపాదించాలని చూస్తోంది. అందులోనూ ఎంతకాలం ఇలా గ్లామర్ డాల్స్ గా మిగిలిపోతాను అని వాదిస్తోంది. అనూష్క ధైర్యం చేసి జేజమ్మ లాంటి పాత్ర చేసింది కాబట్టే ఈ రోజున అంతటా ప్రశంసలు పొందుతోందని ఆమె మెచ్చుకుంటోంది. అందుకే తన పాత్ర చుట్టూ తిరిగే కథలకు ప్రయారిటీ ఇస్తానని ఆమె క్లియర్ గా నిర్మాతలుకు చెప్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే హిందీలో విజయవంతమైన 'కహానీ' ఇప్పుడు తెలుగులో అనామిక పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ సినిమాలో నయనతార చేస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకుడు.

  అనుష్క

  అనుష్క

  అరుంధతి విజయంతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన అనుష్క నిర్మాతల పాలిటి కామధేనువే అయింది. ఆ చిత్రంతో అనుష్క హీరోలతో సమానమైన రేంజ్‌కు చేరింది. జేజమ్మగా అందరి మన్ననలు అందుకొని పరిశ్రమలో పెద్ద నాయికగా, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల హీరోగా ఎదిగింది. దీంతో గతంలో అటకెక్కిన కథలన్నీ కొత్తరూపు సంతరించుకొని షూటింగ్ స్పాట్‌కు పరిగెత్తుతున్నాయి. హీరోల చుట్టే తిరుగుతున్న పరిశ్రమ ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో అనుష్క చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడామె తన చుట్టూ తిరిగే కథలతో వర్ణ, రుద్రమదేవి చిత్రాలు చేస్తోంది.

  ప్రియమణి

  ప్రియమణి

  చారులత, క్షేత్రం వంటి సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన ప్రియమణి చండి అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. వి. సముద్ర డైరెక్షన్లో రానున్న ఈ సినిమా కథ వినగానే ప్రియమణి వెంటనే అంగీకరించింది అని దర్శకుడు చెప్పారు. పంచాక్షరి తరువాత వి. సముద్ర చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ సినిమా కోసం ప్రియమణి విలు విద్య, గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. ఒమిక్స్ బ్యానర్ పై శ్రీను బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఆర్ శంకర్, చిన్న సంగీతం అందిస్తున్నారు.

  డర్టీ పిక్చర్

  డర్టీ పిక్చర్

  బాలీవుడ్ లో మళ్లీ మహిళా ప్రధాన సినిమాలు మూలమైన చిత్రంగా "ది డర్టీ పిక్చర్' ఒకటిగా చెప్పవచ్చు. ఈ సినిమా సిల్క్ స్మిత జీవిత కథ మీద తీసారంటూ విపరీతమైన ప్రచారం జరిపి సూపర్ హిట్ . మిలన్ లుథారియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనం విజయం సాధించింది. ఈ సినిమాని ఏక్తా కపూర్ నిర్మించారు. ఈ సినిమా తర్వాత విద్యాబాలన్...కహాని అనే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసారు.

  షారూఖ్ కి...

  షారూఖ్ కి...

  హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించాలని బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌కు ప్రముఖ నటి షబానా ఆజ్మీ సూచించారు. మహిళలకు సముచిత గౌరవం ఇచ్చే ఉద్దేశంతో సినిమా టైటిల్స్‌లో తన పేరు కన్నా ముందు కథానాయిక పేరు వేసేలా చూస్తానని ఇటీవల షారుక్‌ఖాన్‌ చెప్పారు. ఈ క్రమంలోనే షబానా ఆజ్మీ స్పందించారు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తే షారుక్‌ ఉద్దేశం మరింతగా రాణిస్తుందని ఆమె పేర్కొన్నారు.

  వర్మ సైతం..

  వర్మ సైతం..


  ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘సత్య-2' చేస్తోన్న వర్మ, మరో పక్క ‘బ్రూస్‌లీ' టైటిల్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ఇదేదో హీరోతో యాక్షన్ సినిమా అనుకునేరు. పక్కా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అట. హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు? అనేది త్వరలోనే వెల్లడి స్తారట. . సినిమా అంతా మార్షల్‌ ఆర్ట్‌‌స నేపథ్యంలో ఉంటుందట. ఇందులో నటించే నటీనటులను వర్మ ఇంకా ఖరారు చేయలేదు. ఇందులో నటించే హీరోయిన్ కు వరల్డ్‌లోనే అత్యంత పేరున్న మార్షల్‌ ఆర్ట్‌‌స ప్రవీణుల చేత శిక్షణ ఇప్పించి ఆ తరువాత సెట్స్‌పైకి తీసుకెళ్ళాలని భావిస్తున్నాడట. గతంలో వర్మ మార్షల్‌ ఆర్ట్‌‌స స్టూడెంట్‌ కావడం వల్లే ‘బ్రూస్‌ లీ' సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నాడని వినిపిస్తోంది.

  English summary
  Heroine oriented Telugu films seem to be thriving as actresses evince interest in playing meatier roles. With women's issues finally finding a voice across the country, mana filmmakers are trying to break the mould of casting leading ladies as just arm candies in films and are presenting them in gutsy, heroic characters. And the top leading ladies, from Anushka and Nayanthara to Priyamani and Charmme, are evincing great interest in doing author backed roles. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more