»   » విమానం ఎక్కుతూ పడి రకుల్ ప్రీతి సింగ్ కు గాయాలు

విమానం ఎక్కుతూ పడి రకుల్ ప్రీతి సింగ్ కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గాయపడినట్లు సమాచారం. రీసెంట్ గా జరిగిన సైమా ఈవెంట్ కు హాజరు కాకపోవటంతో ఈ విషయం బయటకు వచ్చింది. యూఎస్ లో ఓ లోకల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు అక్కడికి వెళ్ళిన రకుల్.. ఈ నెల 4 న ఇండియాకు తిరిగి రావలసి ఉంది. అయితే విమానం ఎక్కే హడావుడిలో కింద పడడంతో ఆమె కాలికి గాయమైనట్టు తెలిసింది. మరిని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు రకుల్ కు సలహా ఇచ్చారట. ఆమె గాయం తగ్గటానికి కొద్ది రోజులు పడుతుందని తెలుస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్. ప్రస్తుతం అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది.

కెరీర్ విషయానికి వస్తే..ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా మొన్నటిదాకా శృతి హాసన్ హీరోయిన్ అంటూ చెప్పుకొచ్చిన చిత్రయూనిట్ సడెన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ముందుకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tollywood heroine Rakul Preet Singh injured

తన తండ్రి సినిమా కోసం శృతి హాసన్ కంటిన్యూ డేట్స్ ఇవ్వటంతో, పవన్ సినిమాకు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతున్నట్లు చెప్తున్నారు. దాంతో శృతి హాసన్ దాదాపు ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చినట్టే అంటున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మొత్తం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. సర్దార్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలనే ఆలోచనతో పవన్ మరింత జాగ్రత్త పడుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ గాయపడినట్లు సమాచారం. రీసెంట్ గా జరిగిన సైమా ఈవెంట్ కు హాజరు కాకపోవటంతో ఈ విషయం బయటకు వచ్చింది. యూఎస్ లో ఓ లోకల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు అక్కడికి వెళ్ళిన రకుల్.. ఈ నెల 4 న ఇండియాకు తిరిగి రావలసి ఉంది. అయితే విమానం ఎక్కే హడావుడిలో కింద పడడంతో ఆమె కాలికి గాయమైనట్టు తెలిసింది. మరిని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు రకుల్ కు సలహా ఇచ్చారట. ఆమె గాయం తగ్గటానికి కొద్ది రోజులు పడుతుందని తెలుస్తోంది.

English summary
Sources say the Rakul Preet Singh, while returning to India from the US, hurt her leg.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu