»   » ఆశ్చర్యం : మహేష్, బన్నీ, రాంచరణ్.. వీళ్ళలో అంత క్రియేటివిటీ ఉందా..!

ఆశ్చర్యం : మహేష్, బన్నీ, రాంచరణ్.. వీళ్ళలో అంత క్రియేటివిటీ ఉందా..!

Subscribe to Filmibeat Telugu

బాహుబలికి ముందు పరిస్థితి వేరు. టాలీవుడ్ ఇప్పుడున్న పరిస్థితి వేరు. దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువచ్చిన ప్రమోషన్ టెక్నిక్స్ తో మిగిలిన వారు కూడా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు. బాహుబలి లాంటి సినిమా తీయడం ఒక ఎత్తు.. దానిని జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడం మరో ఎత్తు. రెండింటిలో రాజమౌళి విజయం సాధించారు. దీనితో బాహుబలి రికార్డులని టార్గెట్ గా పెట్టుకున్న టాలీవుడ్ హీరోలు సరికొత్త పంథాలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో బడా హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ మరియు చరణ్ లే మొదటి అడుగు వేయడం విశేషం. ప్రస్తుతం సిద్ధం అవుతున్న వీరి చిత్రాల ప్రమోషన్ విషయంలో ఈ హీరోల హ్యాండ్ ఉందనేది లేటెస్ట్ న్యూస్.

 బాహుబలి తరువాత మారిన పరిస్థితులు

బాహుబలి తరువాత మారిన పరిస్థితులు

వాస్తవానికి బాహుబలి లాంటి చిత్రాన్ని తెరకెక్కించడమే గొప్ప. ఆ విషయంలో రాజమౌళి గ్రేట్. సినిమా ప్రచారం, మార్కెటింగ్ అనేది అతడి సబ్జెక్టు కాదు. అందులో కూడా జక్కన 100 శాతం సక్సెస్ అయ్యారు. మార్కెటింగ్ ఎలా చేయాలని, ప్రమోషన్ లో ఎలాంటి పద్ధతులు అవలంభించాలో రాజమౌళి టాలీవుడ్ కు పాఠాలు నేర్పాడని చెప్పుకోవచ్చు. రాజమౌళి అందించిన బూస్ట్ తో మన హీరోలు కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారు.

ఎవరు ముందు ? ఇదీ డీల్..!
 ముందుండి నడిపిస్తున్న హీరోలు

ముందుండి నడిపిస్తున్న హీరోలు

బాహుబలి తరువాత ఆ స్థాయికి సరితూగాలంటే తాము కూడాఎదోఒకటి కొత్తగా ప్రయత్నించాలని బడా హీరోలు ఫిక్స్ అయ్యారు. కేవలం మంచి సినిమా తీస్తే సరిపోదు. దానికి సంబందించి విన్నూత ప్రచార విధానం అవలంభించాలని డిసైడ్ అయ్యారు. అదే అప్లై చేస్తున్నారు.

 అల్లు అర్జున్ డైరెక్ట్ అటాక్

అల్లు అర్జున్ డైరెక్ట్ అటాక్

సాదరంగా సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యేది ఫస్ట్ లుక్ తో. కానీ బని కొత్తగా ఆలోచించాడు. డైరెక్ట్ గా టీజర్ విడుదల చేసి ఫస్ట్ ఇంపాక్ట్ అని పేరు పెట్టేశాడు. ఇది బన్నీకి వచ్చిన ఆలోచనే అట. ఈ ఫార్ములా సూపర్ సక్సెస్ అయింది. ఫస్ట్ ఇంపాక్ట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

 భరత్ అనే నేను...

భరత్ అనే నేను...

మహేష్ కూడా ఇంకాస్త డిఫెరెంట్ గా అలోచించిరిపబ్లిక్ డే రోజున తన ప్రమాణ స్వీకారం చదివి వినిపించాడు. భరత్ అనే నేను అంటూ సాగిన మహేష్ ప్రమాణ స్వీకారం రీసౌండ్లు పుట్టించింది.

 చిట్టిబాబు, రామలక్ష్మి కేక పుట్టించారు

చిట్టిబాబు, రామలక్ష్మి కేక పుట్టించారు

సాధారణంగా టాలీవుడ్ లో హీరో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ టీజర్ వదిలేసి సరిపెట్టేస్తుంటారు. కానీ చరణ్ నటిస్తున్న రంగస్థలం చిత్ర యూనిట్ హీరోయిన్ సమంత టీజర్ ని కూడా విడుదల చేసింది. చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఈ థాట్ చరణ్ కి వచ్చిందేనట.

 మూస పంథా నుంచి బయట పడుతున్న అభిమానులు

మూస పంథా నుంచి బయట పడుతున్న అభిమానులు

గతంలో టాలీవుడ్ హీరోలు అభిమానులు ఏది కోరుకుంటారో అదే చేసేవారు. క్రమంగా మూస కథలకు, పద్దతులకు ఫాన్స్ స్వస్తి చెబుతుండడంతో హీరోలు కూడా అప్డేట్ కాక తప్పడం లేదు. హీరోలలో కూడా క్రియేటివిటీ పెరుగుతుండడంతో ఆయా హీరోల ఫాన్స్ ముచ్చట పడుతున్నారు.

English summary
Tollywood heros starts thinking different way. Mahesh Babu, Allu Arjun and Ram Charan applying creative ideas in movie promotions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X