»   » టాలీవుడ్లో డ్రగ్స్: ఆ హీరో మీవాడే... కాదు మీవాడే, సోషల్ మీడియాలో ఫైట్!

టాలీవుడ్లో డ్రగ్స్: ఆ హీరో మీవాడే... కాదు మీవాడే, సోషల్ మీడియాలో ఫైట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్లో పలువురు హీరోలు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, సింగర్లకు ఎక్సైజ్ శాఖ నోటీసులు అందించడంతో తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. మొత్తం 15 మందికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరంతా ఈ నెల 19వ తేదీన 'సిట్' ముందు విచారణకు హాజరు కావాల్సిందే అని నోటీసుల్లో పేర్కొన్నారు.

  అయితే ఎవరికి నోటీసులు అందాయి అనే విషయం బయటకు రాక పోయినా.... వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు, ఆనవాళ్లు బయటకు లీక్ అయ్యాయి. అయితే అధికారులు అఫీషియల్ గా పేర్లు బయట పెట్టక పోవడంతో వారెవరో తెలిసినా.... పేర్లు బయట పెట్టే సాహసం చేయడం లేదు తెలుగు మీడియా.

  కాగా... టీవీ ఛానల్స్ లో ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఆయా హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. డ్రగ్స్ కేసులో పట్టుబడింది మీవాడే అని ఓ అభిమాన వర్గం.... కాదు మీవాడే అని మరో అభిమాన వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

  Nani Said Sorry To Tollywood Mass Audience | Filmibeat Telugu

  కాగా... 
  ఫిలిం ఛాంబ‌ర్ త‌రుపున బుధ‌వారం ఉద‌యం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో అర‌వింద్, సురేష్ బాబు, శివాజీ రాజా స్పందించారు. ముంభై నుంచి ఈ క‌ల్చ‌ర్ మ‌న ఇండ‌స్ర్టీకి పాకింది. రేవ్ పార్టీలో ఒక‌రిద్ద‌రు స‌ప‌రేట్ అయి మిగ‌తా వారిని వారిప‌ట్ల ఆక‌ర్షితులు చేయ‌డం జ‌రుగుతుంది. టేస్ట్ కోసం వెళ్లినా త‌ర్వాత డ్ర‌గ్స్ కు బానిస‌ల‌వుతున్నారు. క‌ళ్లు మూసుకుని పాలు త్రాగుతున్నాం అనే భ్ర‌మ‌లో ఉంటే మాత్రం త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దీని వ‌ల్ల వాళ్ల ఆరోగ్యంతో పాటు..కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి వాళ్ల‌కు డ్ర‌గ్స్ పై అవ‌గాహ‌న‌ క‌ల్పించాలి. ప్ర‌భుత్వం వాళ్ల‌ను శిక్షించాల‌ని భావించ‌లేదు. మ‌త్తు నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే ఇలాంటి వాళ్లంద‌రికీ ఎవ‌రు పంపిణీ చేస్తున్నర‌న్న దానిపై మాత్రం సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తోంది. ద‌య‌చేసి ఇలాంటి వాళ్లంతా చెడును వీడి మంచి మార్గంలో కి రావాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు. నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ, డ్రగ్స్ సోసైటీకి హానిక‌రం. ఇలాంటి మార్గంలో వెళ్లే వాళ్లు కు అవేర‌న‌స్ క‌ల్పించాలి. తెలుగు సినిమా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ఉంది. ఆ వాతావ‌ర‌ణం చెడ‌పోకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంది అని అన్నారు. మా అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ఎవ‌రికైనా క‌ష్టం వ‌స్తే..వాళ్ల బాధ‌ల‌ను పంచుకోవ‌డం అనేది తెలుగు సినిమా ఇండ‌స్ర్టీ ఎప్ప‌టి నుంచో చేస్తున్న‌దే. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన డ్ర‌గ్ మ‌హ‌మ్మారిని కూడా మ‌న ద‌గ్గ‌ర నుంచి త‌రిమేయాలి. దీనిపై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించాలి అని అన్నారు.

  ఆ టాప్ దర్శకుడు

  ఆ టాప్ దర్శకుడు

  తెగ స్పీడుగా సినిమాలు తీస్తాడన్న ఓ టాప్ డైరెక్టర్‌కు కూడా నోటీసులు అందాయని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ డైరెక్టర్ ఎవరో అందరికీ అర్థమైపోయింది. ఈ దర్శకుడితో మీ హీరో ఇన్ని సినిమాలు తీశాడు, మీ హీరోకు ఈ విషయం ఇప్పటికే తెలిసే ఉంటుందని అని అభిమానులు వాదులాడుకుంటున్నారు.

  మాస్ హీరో

  మాస్ హీరో

  తెలుగులో మాస్ హీరోలు చాలా మంది ఉన్నా.... ఓ మాస్ హీరోకు మాత్రం బాగా పేరుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని దడదడలాంచి మాస్ హీరోగా పాపులర్ అయిన ఆ స్టార్.... ప్రస్తుతం సరైన హిట్లు, సినిమాలు లేక చాలా వెనకబడి పోయాడు. గతంలో కూడా అతడిపై అనుమానాలు వచ్చాయి. ఈ సారి నోటీసులు అందుకున్న వారి లిస్టులో ఇతడి పేరు ఉండటంతో ఆ మాస్ హీరో ఎవరు? అనే విషయం అందరికీ అర్థమైంది.

  ఎవరు ఆ ముగ్గురు హీరోయిన్లు?

  ఎవరు ఆ ముగ్గురు హీరోయిన్లు?

  డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే వీరికి సంబంధించి ఎలాంటి క్లూస్ ఇంకా బయటకు రాలేదు.

  సెకండ్ హీరోగా స్థిరపడ్డ ఆ స్టార్ ఎవరు?

  సెకండ్ హీరోగా స్థిరపడ్డ ఆ స్టార్ ఎవరు?

  ఒకటి రెండు మంచి సినిమాలున్నా మంచి బ్రేక్ రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడికి నోటీసులు అందినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఇతగాడు అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కూడా కనిపిస్తున్నాడట. దీంతో ఈ హీరో ఎవరనే విషయం కూడా చాలా మందికి ఇప్పటికే అర్థమైంది.

  ఇతడు అందరికీ సుపరిచితమే

  ఇతడు అందరికీ సుపరిచితమే

  బాలనటుడిగా మొదలై హీరోగా ఎదిగి ఒక సినిమాతో మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం హీరోగా సినిమాల్లేకపోవడంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న యువ నటుడికి నోటీసులు అందినట్లు సమాచారం. ఇతడిని గుర్తు పట్టడానికి ఇంతకంటే క్లూ అవసరం లేదు.

  వర్ధమాన గాయకురాలి భర్త

  వర్ధమాన గాయకురాలి భర్త

  ఓ ప్రముఖ వర్దమాన గాయకురాలి భర్తగా, చిన్న చిన్న సినిమాలతో పాటు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కనిపిస్తున్న యువ నటుడికి కూడా నోటీసులు అందాయట. ఇతడి పేరు కూడా చాలా మందికి సుపరిచితమే.

  ఎవరా సింగర్?

  ఎవరా సింగర్?

  సింగర్‌గా రాణించి అగ్రశ్రేణి గాయకుడిగా మారిన మరో యువకుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు....ఇతడు ఎవరు? అనేది ఇంకా ఎవరికీ అంతుపట్టడం లేదు.

  ఆమెపైనే అనుమానం

  ఆమెపైనే అనుమానం

  డైరెక్టర్లతో బాగా చనువుగా ఉండి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూసే ఓ హీరోయిన్ తో పాటు గతంలో హాట్ ఐటం గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఓ బ్యూటీ నోటీసులు అందుకుందట. ఈ క్లూ లభించగానే ఓ హీరోయిన్ మీద అనుమానాలు మరింత బలపడ్డాయి.

  నిర్మాత అతడేనా?

  నిర్మాత అతడేనా?

  సినిమా ఫంక్షన్లలో హీరోలను ఆకాశానికెత్తే నిర్మాతకు కూడా డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయట. ఇతగాడు కూడా డ్రగ్స్ వాడుతాడనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

  English summary
  Tollywood movie lovers argument on Drugs. From some time, drug menace is surely worrying Hyderabad city with a couple of Nigerians and Old City resident arrested in connection with the same. But today's report in a leading English daily has started haunting Tollywood big time.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more