»   » లోబిపితో పడిపోయింది, పెదవి పగిలింది, లేడీ ఎన్టీఆర్..శ్రీదేవి ది గ్రేట్!

లోబిపితో పడిపోయింది, పెదవి పగిలింది, లేడీ ఎన్టీఆర్..శ్రీదేవి ది గ్రేట్!

Subscribe to Filmibeat Telugu
Sridevi unconcious Resulting In Splitage Of Lips

సినీవినీలాకాశంలో మెరుపులు మెరిపించి శ్రీదేవి శాశ్వతంగా అభిమానులకు, కుటుంబసభ్యులకు దూరం అయ్యారు. ఆమె జీవితం ఘనమైన చరిత్రగా మిగిలిపోయింది. బుధవారం అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎందరో స్టార్ హీరోలకు శ్రీదేవి లక్కీ హీరోయిన్. కేవలం హీరోలకు మాత్రమే కాదు దర్శక, నిర్మాతలకు సైతం శ్రీదేవి కల్పతరువుగా అప్పట్లో ఉండేది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చి సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించేది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కు శ్రీదేవి ప్రత్యేకం. ఆయన నిర్మాణంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆఖరి పోరాటం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో శ్రీదేవి నటించారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న నిర్మాత

అంత్యక్రియల్లో పాల్గొన్న నిర్మాత

అశ్విని దత్ ముంబై వెళ్లి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీదేవి గారు తన జీవితంలో చిరకాలం గుర్తుంది పోయే జ్ఞాపకం అని అశ్వినీదత్ అన్నారు.

శ్రీదేవి కుమార్తెల ముఖాలు చూడలేకపోయా

శ్రీదేవి కుమార్తెల ముఖాలు చూడలేకపోయా

అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా తాను శ్రీదేవి కుమార్తెల ముఖాలు చూడలేకపోయాని అన్నారు. తల్లి కోసం ఇద్దరు కుమార్తెలు తల్లడిల్లిపోయారని అశ్వినీదత్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె కుటుంబం మొత్తం షాక్ లో ఉన్నారని అశ్వినీదత్ అన్నారు.

ఆమె కుటుంబానికే కాదు

ఆమె కుటుంబానికే కాదు

శ్రీదేవి మరణం కేవలం ఆమె కుటుంబానికే కాదు, భారత సినీప్రపంచం మొత్తానికి షాక్ అని అన్నారు.

శ్రీదేవి 100 శాతం అలాంటి హీరోయిన్

శ్రీదేవి 100 శాతం అలాంటి హీరోయిన్

అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీదేవి నటనని, ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు ప్రదర్శించిన మంచి ప్రవర్తనని ఆయన కొనియాడారు. శ్రీదేవి వందశాతం ప్రొడ్యూసర్స్ హీరోయిన్ అని ఆశ్వినిదత్ అన్నారు.

లోబిపితో పడిపోయింది

లోబిపితో పడిపోయింది

శ్రీదేవి ప్రొడ్యూసర్స్ హీరోయిన్ అని చెప్పడానికి ఓ ఉదాహరణ వివరించారు. తిరుపతిలో గోవిందా గోవిందా చిత్ర షూటింగ్ జరుగుతోంది. తెల్లవారు జామున 4 గంటలకు శ్రీదేవి లోబిపితో పడిపోయారు. ఆమె పెదవి పగిలి రక్తం వస్తోంది. ఆ సమయంలో ఆమెని మద్రాసు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తన్నాను.

లోకల్ హాస్పిటల్ లో

లోకల్ హాస్పిటల్ లో

కానీ శ్రీదేవి షూటింగ్ కు ఆటంకం కలగకూడదని భావించారు. తిరుపతిలోని లోకల్ హాస్పటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుని షూటింగ్ కు రెడీ అయిపోయారు. పగిలిన పెదవిని మేకప్ తో కవర్ చేసుకున్నారు అని అశ్వినీదత్ అన్నారు.

ఆమె లేడీ ఎన్టీఆర్

ఆమె లేడీ ఎన్టీఆర్

అప్పట్లో ఆర్టిస్ట్ లలో ఎన్టీఆర్ ఎంత డిగ్నిఫైడ్ గా ఉండేవారో శ్రీదేవి అలా ఉండేవారు అని అశ్వినీదత్ అన్నారు. ఆమెని చూస్తే తనకు లేడీ ఎన్టీఆర్ అనిపించేవారని కొనియాడారు.

అలాంటి విషయాలు శ్రీదేవికి తెలియవు

అలాంటి విషయాలు శ్రీదేవికి తెలియవు

పారితోషకం విషయంలో శ్రీదేవి ఎలా వ్యవరించేవారు అనే ప్రశ్నకు అశ్వినీదత్ సమాధానం ఇచ్చారు. శ్రీదేవికి అలంటి విషయాలు తెలియవని, ఆమెకు సంబందించిన వ్యవహారాలు మొత్తం వారి అమ్మగారు చూసుకునేవారని అన్నారు.

క్రమశిక్షణే ఈ స్థాయికి

క్రమశిక్షణే ఈ స్థాయికి

శ్రీదేవిని క్రమశిక్షణే ఈ స్థాయికి చేర్చిందని అశ్వినీదత్ అన్నారు, సమయానికి రావడం నటించడం, వెళ్లడం.. ఇదే ఆమెకు తెలుసు అని అశ్వినీదత్ అన్నారు.

అప్పటికే బాలీవుడ్ లో స్టార్

అప్పటికే బాలీవుడ్ లో స్టార్

శ్రీదేవి ఆఖరి పోరాటం చిత్రం చేసే సమయానికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అని అశ్వినీదత్ అన్నారు. అయినా కూడా తాను అడిగిన వేంటనే కాదనకుండా ఆఖరి పోరాటం చిత్రంలో నటించారని అన్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది.

టర్నింగ్ పాయింట్

టర్నింగ్ పాయింట్


శ్రీదేవి అతిలోక సుందరిలా కనిపించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం టీనా వైజయంతి మూవీస్ బ్యానర్ కు టర్నింగ్ పాయింట్ అని ఆయన అన్నారు.

ఆ తర్వాత గోవిందా గోవిందా

ఆ తర్వాత గోవిందా గోవిందా

నాగార్జునతో కలసి మరోమారు శ్రీదేవి నటించిన చిత్రం గోవిందా గోవిందా. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

English summary
Tollywood producer Aswani Dutt remembers Sridevi. He shares interesting incident of Sridevi with media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu