»   » ముఠామేస్త్రీ నిర్మాత శేఖర్‌బాబు కన్నుమూత

ముఠామేస్త్రీ నిర్మాత శేఖర్‌బాబు కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖర్‌బాబు (73) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, సర్దార్‌, ముఠామేస్త్రీ, చిలకమ్మ తదితర సినిమాలను ఆయన నిర్మించారు.

Tollywood Producer Sekhar Babu No more.

గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేండ్ల క్రితం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో సన్నిహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tollywood Producer Sekhar Babu No more.

1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించారు. నిర్మాతగా మారి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను శేఖర్‌ బాబు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవితో ముఠా మేస్త్రీ నిర్మించారు. శేఖర్ బాబు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్‌లో పని చేశారు. శేఖర్‌‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

English summary
Mutha Mestri producer KC Sekhar Babu died with Heart Attack. He produced few successful movies in Tollywood. Tollywood mourns for his sudden demise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu