»   » యమలోకంలో తెలుగు యంగ్ హీరోలు(ఫోటో ఫీచర్)

యమలోకంలో తెలుగు యంగ్ హీరోలు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు తెరపై యముడి నేపథ్యం అనేది సక్సెస్‌ఫుల్ ఫార్మూలా. గతంలో ఇలాంటి కధానేపధ్యంలో తెలుగులో దేవాంతకుడు, యమగోల, యముడికి మొగుడు, యమ జాతకుడు, యమలీల లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రం నుంచి ఈ చిత్రాలు వరస మళ్లీ మొదలైంది. ప్రతీ హీరో తమదైన శైలిలో సినీ యమలోకంలో ప్రవేశించి హిట్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.

యముడు చిత్రాలకు మళ్లీ ఊపు తెచ్చిన చిత్రంగా యమదొంగను చెప్పుకోవాలి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా యముడు గా మోహన్ బాబు అద్బుతంగా కుదిరాడంటూ జనం నీరాజనాలు పట్టారు.

రవితేజ లేటెస్ట్ గా చేసిన సోషియో ఫాంటసీ దరువు. యమదొంగ, యమగోల కలిసి వండినట్లున్నగా ఉన్న దరువు చిత్రంలో రవితేజ బుల్లెట్ రాజా గా కనిపిస్తాడు. ఏ పనైనా వెనకా ముందు ఆలోచించకుండా చేసేసే బుల్లెట్ రాజా ఓ రోజు చనిపోతాడు. యముడు మీద కోపంతో చిత్ర గుప్తుడు అతని ఆయుస్సు అవ్వకుండా రవితేజను చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రవితేజ.. యమగోల, యమదొంగ టైప్ లో యముడుపై యుద్దం ప్రకటిస్తాడు. అక్కడున్న వారసత్వాన్ని ప్రశ్నించి చివరకు తిరిగి భూమి మీదకు వెళ్లిపోవటానికి ఫర్మిషన్ సంపాదించి క్రిందకి వచ్చే ఏం చేస్తాడన్నిది ఆసక్తి కరం. అయితే ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు.

కామెడీ చిత్రాల శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శ్రీకాంత్,వేణులకు బ్రేక్ ఇచ్చింది. యంగ్ యముడుగా శ్రీకాంత్,యంగ్ చిత్ర గుప్తుడుగా వేణు అదరకొట్టారు. వీరిద్దరూ భూమి మీదకు వచ్చి ప్రేమలో పడే సన్నివేశాలు నవ్వించి సినిమాను నిలబెట్టాయి.


యమడు అని టైటిల్ లో ఉన్నంత మాత్రాన చిత్రాలు హిట్టవ్వవు అని నిరూపించిందీ చిత్రం. శివాజి హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక చతికిలపడింది.

రాజేంద్రప్రసాద్..యముడుగా ఎలా ఉంటాడో చూడాలంటే ఈ సినిమాకి వెళ్దాం రండి చిత్రం చూడాలి. ఓ వ్యక్తిలో పరివర్తన తేవటానికి ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ యముడు అవతారం ఎత్తి భూలోకంలో యమలోకం క్రియేట్ చేసి నవ్వులు పండిస్తాడు.

అల్లరి నరేష్ తాజా చిత్రానికి చిరంజీవి సూపర్ హిట్‘యముడికి మొగుడు' టైటిల్ ని ఖరారు చేసారు. యమలోకం బ్రాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రాన్ని ఇ.సత్తిబాబు డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అల్లుడా మజాకాలోని సూపర్ హిట్ సాంగ్..అత్తో అత్తమ్మ కూతురోని కూడా రీమిక్స్ చేస్తున్నారు. ఈ సారి అత్తగా రమ్యకృష్ణ కనిపించి అలరించనుంది. ఈ చిత్రం కామెడీతో కితకితలు పెడ్తుందని చెప్తున్నారు.

సాయిరామ్‌శంకర్, పార్వతి మెల్టన్ జంటగా జి.వి.కె.ఆర్ట్స్ పతాకంపై జి.విజయ్‌కుమార్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘యమహో యమః'. ఇంతకు ముందు వచ్చిన యమ సినిమాలకు, మా సినిమాకూ పూర్తి వ్యత్యాసముంది. మా యముడు ఆంధ్రాలోనే కాకుండా అమెరికాలో కూడా సందడి చేస్తాడు. యమధర్మరాజుగా శ్రీహరి గెటప్ అదిరిపోతుంది. ఆయనకు తోడుగా చిత్రగుప్తుని పాత్రలో ఎమ్మెస్ నారాయణ అలరించబోతున్నారు అని ధీమాగా చెప్తూ వస్తున్నారు.

English summary
Telugu film industry’s infatuation with Yama Dharma Raja dates back to the 70s. The introduction of a new genre,socio-fantasy laid the foundation for making Yama Dharma Raja a key character in such films. In the past, films like Yamagola, Yamudiki Mogudu, Yamaleela revolved around the concept of a hero’s confrontation with Yama which often leads to hilarious situations. From late 90s to mid 2010s, it seemed like the trend had taken a backseat and then S S Rajamouli’s Yamadonga changed everything.
Please Wait while comments are loading...