సీనియర్ నటుడు వినోద్ ఇకలేరు.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కన్నుమూత!

By Rajababu

Recommended Video

సీనియర్ నటుడు వినోద్ కన్నుమూత

తెలుగు చిత్ర సీమ మరో ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. సుమారు రెండు దశాబ్దాలకుపైగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకొన్న సీనియర్ నటుడు వినోద్ ఇకలేరు. శుక్రవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వర‌రావు. 1980లో వీ విశ్వేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కీర్తి, కాంత, కనకం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 చిత్రాలకు పైగా నటించారు.

1980లో టాలీవుడ్‌లోకి

1980లో టాలీవుడ్‌లోకి

వినోద్ అసలు పేరు అరిశెట్టి నాగేశ్వర‌రావు. 1980లో వీ విశ్వేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కీర్తి, కాంత, కనకం అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 చిత్రాలకు పైగా నటించారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్‌గా

క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్‌గా

వినోద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా విలన్ పాత్రల్లో కూడా మెరిసారు. చంట, లారీ డ్రైవర్, నరసింహనాయుడు, ఇంద్ర సినిమాల్లో వినోద్ పోషించిన పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తమిళంలో 28, హిందీలో 2 చిత్రాల్లో నటించారు.

టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి

టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి

వినోద్ ఆకస్మిక మృతికి తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. ప్రతిభావంతుడైన నటుడిని తెలుగు చిత్రసీమ కోల్పోయింది అని పలువురు పేర్కొన్నారు.

మా సంతాపం..

మా సంతాపం..

వినోద్ మృతికి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) సంతాపం వ్యక్తం చేసింది. మా అధ్యక్షుడు శివాజీరాజా ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మా సభ్యులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X