twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెనర్జీ తండ్రి, సీనియర్ నటుడు రాఘవయ్య మృతి

    By Bojja Kumar
    |

    ప్రముఖ తెలుగు నటుడు రాఘవయ్య (86) ఆదివారం(ఏప్రిల్ 15) ఉదయం గుండె సంబంధిత వ్యాధి‌తో మృతి చెందారు. ఆయనకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌కు మ‌హాప్ర‌స్థానంలో ఆయ‌న అంతిమ సంస్కారాలు పూర్తి చేయ‌నున్నారు.

    రాఘవయ్య దాదాపు 50 ఏళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొన‌సాగుతున్నారు. మ‌ద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా, అట్నుంచి హైద‌రాబాద్ షిఫ్ట్ అయిన క్ర‌మంలోనూ సినీరంగంలో న‌టుడిగా కొన‌సాగారు. బ్ర‌హ్మ‌చారి అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న‌.. వంద‌లాది చిత్రాల్లో న‌టించారు.

    Tollywood Senior Actor Raghavaiah Passes Away

    టాలీవుడ్లో రాఘవయ్య ఈ మధ్య కాలంలో వీరాంజ‌నేయ‌, క‌థానాయ‌కుడు, య‌మ గోల చిత్రాల్లో న‌టించారు. ఆయన నటించిన చివరి సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' ఈనెల 20న రిలీజ‌వుతోంది. ఇందులో ఆయన ఓ చిన్న పాత్రలో నటించారు.

    కాగా, రాఘవయ్య కుమారుడు బెన‌ర్జీ టాలీవుడ్‌లో ద‌శాబ్ధాలుగా కెరీర్‌ని సాగిస్తున్నారు. కుమార్తె ప్ర‌స్తుతం చెన్న‌య్‌లోనే స్థిర‌ప‌డ్డారు. బెన‌ర్జీ ప్ర‌స్తుతం మా అసోసియేష‌న్‌లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త విన్న అనంత‌రం మాబృందం త‌మ ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసింది.

    English summary
    Well-known Telugu cinema Senior Actor Raghavaiah passed away in this morning at his house. He was 86. Raghavaiah was ailing for some time with Heart problem.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X