»   » ఉదయభానును అవమానించిన ఆ లేడీ సింగర్ ఎవరు?

ఉదయభానును అవమానించిన ఆ లేడీ సింగర్ ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు యాంకర్ ఉదయభాను మరో పది రోజుల్లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన పలు విషయాలు చెప్పుకొచ్చింది.

కుక్కలు అలాగే మొరుగుతాయ్: భర్త గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఉదయభాను!

ఈ సందర్భంగా మీకు వృత్తి పరమైన పోటీ, మీపై అసూయ పడటం లాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయా? అనే దానికి ఉదయభాను ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తనను తీవ్రమైన అవమానానికి గురి చేసిన ఓ ప్రముఖ తెలుగు సింగర్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఆ సింగర్ ఎవరు? అనేది మాత్రం ఉదయభాను వెల్లడించలేదు.

Tollywood Singer insulted anchor Udaya Bhanu?

ఆ సంఘటన గురించి ఉదయభాను చెబుతూ... 'యూఎస్‌లో ఒక ప్రోగ్రామ్ చేశాం. మన తెలుగు పరిశ్రమలో ఆవిడ మంచి సింగర్. తనను స్టేజి మీదకు పిలిచే ముందు వీలైనంతగా పంప్ కొట్టేదాన్ని. నేను స్టేజి మీదకు రాగానే హైప్ క్రియేట్ అవుతుంది. తను రాగానే కొంచెం డౌన్ అవుతుంది. దాంతో 'నేను ముందు వెళతాను' అని తనే వెళ్లి పాడుతోంది. అందర్నీ స్టేజి మీదకు పిలుస్తోంది.. పాడుతోంది. నన్ను పిలవడంలేదు' అని ఉదయభాను తెలిపారు.

కాబోయే కోడలు సమంతను పరిచయం చేసిన నాగార్జున... (ఫోటోస్)

"తర్వాత...అదే కార్యక్రమంలో యాంకర్స్ మీద సెటైర్ వేసే స్కిట్ రన్ అవుతున్నప్పుడు.. 'యాంకర్ ఉదయభాను వస్తారు' అని ఆ స్కిట్ చేసేవాళ్లే పిలిచారు. నేను స్టేజి మీదకు వెళ్లేటప్పుడు ఆర్కెస్ట్రా వాళ్లు నీరసం వచ్చే బీట్ ఒకటి వేశారు. వాళ్లను ఆవిడ తీసుకొచ్చింది. షో అయిపోయి, గుడ్‌బై చెప్పేటప్పుడు నన్ను తప్ప మొత్తం టీమ్‌ని పిలిచింది. అయినా నేను స్టేజి మీదకు వెళ్లి, 'థర్టీ డేస్ నుంచి ఈ షో చేస్తున్నా. ఈరోజు లాస్ట్ షో. మీ అందరికీ గుడ్‌బై చెబుదామనుకున్నా. మేడమ్ పిలవలేదు. అందరూ అంటున్నారు మేం మళ్లీ రావాలని. నేను మళ్లీ రాను. రావాలని కూడా లేదు. ఇక్కడకు వచ్చి ఎన్నో సాధించారు. మీరు మన దేశం రావాలి. అక్కడ ఒకామె ఎదురు చూస్తోంది. ఆవిడే మీ అమ్మ. మీ దేశం కోసం, మీ ఊరి కోసం మీరు రావాలి. చేతనైనంత సాయం చేయండి. వస్తారని ఆశిస్తున్నా' అన్నాను. అందరూ చప్పట్లు కొట్టారు. మాట్లాడి వచ్చేశాక 'నేను పిలవాలనే..' అంటూ సాగదీసింది. ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే ఇండస్ట్రీలో నాకు స్నేహితులు తక్కువ. బయట నా కోసం ప్రాణమిచ్చే స్నేహితులున్నారు" అని ఉదయ భాను చెప్పుకొచ్చారు.

English summary
In a recent interview, Udaya Bhanu revealed that she has been pregnant hence she went into oblivion. She also revealed that she had faced several humiliations during her glorious career, and no one knew that as she always portrayed a brave face in front of the camera. She cited the example of how a top Telugu female singer embarrassed her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu