Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అవును డబ్బు అంటే కఠినంగానే ఉంటాను.. అందుకే 23 పెళ్లిళ్లు చేశాను: బ్రహ్మానందం
ఎంత మంది కమెడియన్స్ ఉన్నా కూడా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం. కింగ్ కమెడియన్ గా హాస్య బ్రహ్మగా అనేక రకాల ట్యాగ్స్ అందుకున్న ఈ సీనియర్ కమెడియన్ పెద్దగా వివధాల్లోకి వెళ్లరు. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. అయితే డబ్బు అనే విషయం వచ్చేసరికి ఆయన చాలా కఠినంగా ఉంటారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి వివరణ ఇచ్చారు.

గిన్నిస్ రికార్డ్..
దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్న బ్రహ్మానందం ఏ యాక్టర్ లేనంత బిజీగా ఉండేవారు. ఆయన కోసం స్పెషల్ గా డేట్స్ మార్చుకున్న హీరోలు కూడా ఉన్నారు. బ్రహ్మి ఉంటేనే సినిమా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. అలాగే పలు ప్రఖ్యాత అవార్డులు కూడా అందుకున్నారు.

డబ్బు విషయంలో..
అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే కమెడియన్స్ లో బ్రహ్మానందం ఒకరు. డైలీ పేమెంట్స్ తీసుకునే ఆయన సమయానికి మించి వర్క్ చేస్తే మరుసటి రోజు పేమెంట్ కూడా అందుకునేవారని ఒక టాక్ ఉంది. డబ్బు విషయంలో ఏ మాత్రం కనికరం చూపరని మొత్తం పేమెంట్ ఒకేసారి ఇవ్వాలని మొండి పట్టుతో వ్యవహరిస్తారని కూడా అంటుంటారు.

అవును కఠినంగానే ఉంటాను..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం తనపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆ రూమర్స్ ఎంతవరకు నిజం అనే విషయం పక్కనపెడితే.. అవును నేను కొంత ఆ విషయంలో కటినంగానే ఉంటాను. అలా ఉండకపోతే ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. నేను చేసిన సహాయల గురించి ఎవరికి చెప్పుకోను.

23జంటలకు సాయం చేశాను..
'సినిమా ఇండస్ట్రీలో డబ్బుకి గౌరవం ఇవ్వని వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో అందరికి తెలిసిన విషయమే. అలాంటి సంఘటనల గురించి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను వంద రూపాయాలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు సాయం చేస్తాను. ఇప్పటివరకు 23 మంది ఆడపిల్లకు పెళ్లిళ్లు చేశాను. ఈ విషయం ఎవరికి తెలియదు. నేను ప్రచారాలు చేసుకునే మనిషిని కాదు' అని బ్రహ్మానందం వివరణ ఇచ్చారు.