»   »  చరణ్, బన్నీ కూడా-రాజకీయాల్లో సినీ‌స్టార్స్ రగడ (ఫోటో ఫీచర్)

చరణ్, బన్నీ కూడా-రాజకీయాల్లో సినీ‌స్టార్స్ రగడ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చాలా మంది స్టార్స్ ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, జయసుధ, రోజా, విజయశాంతి లాంటి వారు వివిధ పార్టీల్లో ప్రవేశించడంతో రాజకీయాలు రసవత్తరంగా మరాయి. ఈ సారి వీరితో పాటు మరింత మంది రంగంలోకి దిగతున్నారు.

పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ పేరుతో ఈ సారి ఎన్నికల బరిలోకి వస్తుండగా.....నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్, అలీ లాంటి వారు కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యారు. బాలయ్య, కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయడానికి, మహేష్ బాబు తన బంధువు, టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ తరుపున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన జూ ఎన్టీఆర్ ఈ సారి చేస్తారా? లేదా? అనేది ఇంకా ఖరారు కాననప్పటికీ, అంతిమంగా ఆయన తెలుగుదేశం వైపే మళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రచార సారది బాధ్యతలు చేపట్టడంతో రామ్ చరణ్, బన్నీ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రాచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

హాస్య నటుడు అలీ ఈ సారి తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగబోతోంది. జయసుధ, విజయశాంతి కాంగ్రెస్ పార్టీ తరుపున తెలంగాణ ప్రాంతంలో బరిలోకి దిగుతున్నారు.

చిరంజీవి

చిరంజీవి


ప్రస్తతం కేంద్ర మంత్రిగా పని చేస్తున్న చిరంజీవి 2014 ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రచార సారథిగా నియమితులయ్యారు. విభజన కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో ఖాళీ అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజానెత్తుకున్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘జన సేన' పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యం‌గా పెట్టుకున్నారాయన.

బాలకృష్ణ

బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. పార్టీ నిర్ణయించిన స్థానం నుండి ఆయన పోటీకి దిగుతారనే ప్రచారంకూడా జరుగుతోంది.

జయసుధ

జయసుధ


కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జయసుధ, వచ్చే ఎన్నికల్లో కూడా అదే పార్టీ తరుపున సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగబోతోంది.

రోజా

రోజా


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున రోజా ఈ సారి కూడా నగరి నియోజకవర్గం నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


గతంలో తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన జూ ఎన్టీఆర్ ఈ సారి ఆ పార్టీ తరుపున ప్రచారం చేస్తారా? లేదా మిన్నకుంటారా? అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబుతో జూ ఎన్టీఆర్‌కు, హరికృష్ణకు విబేధాలు ఉండటం వల్లనే ఈ సందిగ్ధ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

రామ్ చరణ్ తేజ్

రామ్ చరణ్ తేజ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రి చిరంజీవికి తోడుగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ ఎన్నికల్లో చిరంజీవికి తోడుగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.

విజయశాంతి

విజయశాంతి


టీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో దూకిన విజయశాంతి ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారు.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్


నందమూరి హీరోల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబు

మహేష్ బాబు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్ బాబు ఆయన బంధువు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్ తరుపున ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

English summary

 Tollywood stars Chiranjeevi, Pawan Kalyan, Ram Charan Tej, Allu Arjun, Balakrishna, Mahesh Babu prepared for the election campaign 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu