Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Re Releases: త్వరలో థియేటర్స్ విడుదల కాబోతున్న పాత సినిమాలు.. అందరి ఫోకస్ దానిపైనే!
సినిమా ప్రపంచంలో గడిచిన రెండు మూడేళ్ళు కాలంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా మళ్ళీ పాత సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తే జనాలు ఎగబడి చేస్తున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే ఫ్లాప్ అయిన సినిమాలను సైతం కొత్త సినిమాల తరహాలో ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. రీసెంట్ గా ఖుషి జల్సా పోకిరి ఒక్కడు సినిమాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరి కొంతమంది స్టార్ హీరోల సినిమాలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలను కూడా విడుదల చేయడానికి కొందరు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అవుతున్నారు.
నేటి టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ చేసి 4K వెర్షన్ లో వెండి ధరపై చూపించడానికి కొందరు రెడీ అవుతున్నారు. ఇక రాబోయే మరికొన్ని రోజుల్లో కొన్ని సినిమాల రీ రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. ఆ వివరాలలోకి వెళితే ముందుగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా జనవరి 19వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎలాంటి కాంట్రవర్సీలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మళ్లీ ఏడాదిలోపే థియేటర్లలో విడుదల చేస్తున్నారు అంటే ఇలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇక రవితేజ మిరపకాయ్ సినిమా జనవరి 26న వస్తుండగా తొలిప్రేమ 4K లో ఫిబ్రవరి 14వ తేదీన రాబోతోంది. ఇక ఈ నగరానికి ఏమైంది, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. సినిమాలను కూడా రీ రీలీజ్ చేయబోతున్నారు. సింహాద్రి 4K వెర్షన్ మే 21 తేదీన విడుదల కానుండగా 7/G బృందావన కాలనీ సినిమాను కూడా సమ్మర్లో విడుదల చేయనున్నారు. ఇక అందరి ఫోకస్ అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమాపై ఎక్కువగా పడింది. అదే టైటానిక్. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు 4K వెర్షన్ లో ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.