Just In
- 18 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తెలుసా?: ఈ డైరక్టర్స్ అంతా ఒకప్పుడు రైటర్సే (లిస్ట్), ఇప్పుడు మరొకరు
హైదరాబాద్: సినిమాలకు కధా,మాటలు ,స్కీన్ ప్లే లు రాసిన ఎంతో మంది రైటర్స్ ..దర్శకులుగా మెగా ఫోన్ పట్టుకోవటం కొత్త విషయం ఏమీ కాదు. అంతేకాదు తమ రచనా అనుభవంతో హిట్స్ కొడుతూ రాణిస్తున్నారు. తెలుగులోనూ ప్రస్తుతం రైటర్స్ నుంచి దర్శకులుగా మారే సీజన్ నడుస్తోంది.
అల్లరి నరేష్ తో ఎన్నో కామెడీలు రాసి, తర్వాత 'ఢమరుకం', 'అఖిల్', పండగ చేస్కో లాంటి స్టార్స్ చిత్రాలకు రచయితగా పనిచేసిన వెలిగొండ ఇప్పుడు కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నట్లు సమాచారం. హీరో మరెవరో కాదు రాజ్ తరుణ్.
ఇటీవలే రాజ్‌తరుణ్‌కి వెలిగొండ ఓ కథ చెప్పారట. అది రాజ్ తరుణ్‌కి బాగా నచ్చింది. వెంటనే ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
తెలుగులో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన అనుభవంతో దర్శకులుగా రాణించిన డైరక్టర్స్ లిస్ట్ ఇదిగో..

కొరటాల శివ
భధ్ర, ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం వంటి ఎన్నో చిత్రాలకు కథ, మాటలు రాసిన కొరటాల శివ మిర్చితో డైరక్టర్ అయ్యారు. తర్వాత శ్రీమంతుడు ఇప్పుడు జనతాగ్యారేజ్ డైరక్ట్ చేస్తున్నారు.

త్రివిక్రమ్
స్వయంవరం, నువ్వే కావాలి, చిరు నవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే , మన్మధుడు ఇలా వరస పెట్టి రైటర్ గా ఎన్నో హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ అతడు చిత్రంతో డైరక్టర్ గా మారి వరస పెట్టి పెద్ద హీరోలతో చేస్తున్నారు. రీసెంట్ గా అ..ఆ చిత్రం హిట్ ఇచ్చారు.

సుకుమార్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ , బావగారు బాగున్నారా వంటి చిత్రాలకు స్క్రిప్టు డిపార్టమెంట్ లో చేసిన ఆయన తర్వాత ఆర్యతో డైరక్టర్ అయ్యి, మొన్న నాన్నకు ప్రేమతో చిత్రం చేసారు. మరో ప్రక్క ఆయన స్క్రిప్టులు అందిస్తూ కుమారి 21 ఎఫ్ చిత్రం చేసారు.

వీరూ పోట్ల
వర్షం, నువ్వు వస్తానంటే నే వద్దంటానా చిత్రాలకు రైటర్ గా పనిచేసి హిట్ కొట్టిన వీరూపోట్ల బిందాస్ తో దర్శకుడుగా మారి రగడ, దూసుకెళ్తా చేసారు. ఇప్పుడు ఈడు గోల్డ్ ఎహే చేస్తున్నారు.

దశరధ్
శుభవేళ, చిత్రం, ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను చిత్రాలకు రైటర్ గా పనిచేసిన దశరధ్...సంతోషం చిత్రంతో దర్శకుడుగా మారారు. ఈ మధ్యనే శౌర్య చిత్రం డైరక్ట్ చేసారు.

విజయోంద్రప్రసాద్
తన కుమారుడు రాజమౌళి చిత్రాలకే కాక ఎన్నో తెలుగు హిట్ చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్...1996 లో అర్దాంగి చిత్రంతో దర్శకుడుగా మారి, శ్రీ కృష్ణ 2006, రాజన్న చిత్రాలు డైరక్ట్ చేసారు. ఇప్పుడు సైతం వల్లి అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.

పోసాని కృష్ణ మురళి
గాయం, రక్షణం, పోలీస్ బ్రదర్శ్, పవిత్ర బంధం ఇలా వరసపెట్టి ఎన్నో హిట్ సినిమాలకు డైలాగులు రాసిన పోసాని, శ్రావణ మాసం తో దర్శకుడుగా మారి, ఆపరేషన్ దుర్యోధనతో హిట్ కొట్టారు.

పరుచూరి బ్రదర్శ్
రైటర్స్ గా పరుచూరి బ్రదర్శ్ ఇచ్చినన్ని హిట్స్ తెలుగులో మరొకరు ఇవ్వలేదేమో. వీరు సర్పయోగంతో దర్శకులుగా మారారుయ మా తెలుగుతల్లి, రేపటి స్వరాజ్యం చిత్రాలు డైరక్ట్ చేసారు.

డార్లింగ్ స్వామి miss
ప్రబాస్ డార్లింగ్ చిత్రం డైలాగులు రాసి డార్లింగ్ స్వామి గా పేరు పడ్డ స్వామి తర్వాత ఎన్నో సినిమాలకు డైలాగులు రాసారు. రీసెంట్ గా దృశ్యం చిత్రానికి సైతం పనిచేసారు. అలాగే రొమాన్స్ అనే చిత్రాన్ని డైరక్ట్ చేసారు.

బివియస్ రవి
గర్ల్ ప్రెండ్ చిత్రంతో మొదలెట్టి సత్యం, భధ్ర, చక్రం, అతిధి ఇలా ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రవి ...గోపీచంద్ తో చేసిన వాంటెడ్ చిత్రంతో దర్శకుడుగా మారారు. ఇప్పుడు ఆయన సాయి ధరమ్ తేజ హీరోగా సినిమాను డైరక్ట్ చేయబోతున్నారు.

శోభన్
మహేష్ బాబు బాబి చిత్రంతో దర్శకుడుగా మారిన శోభన్ వర్షం చిత్రంతో హిట్ కొట్టారు. అంతకు ముందు సింధూరం, మురారి, నాని అనేక చిత్రాలకు డైలాగులు,స్క్రిప్టు రాసారు..

కృష్ణ చైతన్య
'ఇష్క్', 'పవర్', 'సరైనోడు', 'అఆ' లాంటి అనేక సినిమాల్లో నాలుగు వందలకు పైగా పాటలు రాశాడు. రీసెంట్ గా ఓ చిత్రానికి సావిత్రి చిత్రానికి మాటలు కూడా రాసిన కృష్ణ చైతన్య...రౌడీ ఫెలో చిత్రంతో డైరక్టర్ గా మారారు.

వక్కంతం వంశీ
కిక్, ఎవడు, రేసుగుర్రం వంటి ఎన్నో హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ... ఎన్టీఆర్ ని త్వరలో డైరక్ట్ చేయబోతున్నారు.

గోపీ మోహన్
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అనేక సూపర్ హిట్ చిత్రాలకు రచన చేసిన గోపీ మోహన్ ..త్వరలో దర్శకుడుగా మారబోతున్నారు. మళ్ల విజయప్రసాద్ నిర్మిస్తారని చెప్తున్నారు.

మరుధూరి రాజా
ఎన్నో హిట్ సినిమాలకు డైలాగులు రాసి, కథలు అందించిన మరుధూరి రాజా...అందరికీ వందనాలు చిత్రంతో దర్శకుడుగా మారారు.

సత్యానంద్
తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు కథ, మాటలు ,స్క్రీన్ ప్లే అందించిన సత్యానంద్ గారు..అప్పట్లో భానుప్రియ ప్రధాన పాత్రలో ఝాన్సీ రాణి చిత్రం డైరక్ట్ చేసారు.

జంధ్యాల
రచయితగా జంద్యాల పీక్స్ చూసారు. అ తర్వాత ఆయన దర్సకుడుగా మారి ఆనంద భైరవి, అహనా పెళ్లంట, నాలుగు స్ధంబాలాట, ముద్ద మందారం, శ్రీవారికి ప్రేమలేఖ, బాబాయి అబ్బాయి, చంటబ్బాయి వంటి ఎన్నో చిత్రాలు డైరక్ట్ చేసి హిట్స్ అందించారు.

నరసరాజు
రాముడు-భీముడు, యమగోల వంటి ఎన్నో సూపర్ హిట్స్ కు కథ,మాటలు, స్క్రీన్ ప్లే అందించిన నరసరాజు గారు ...దర్శకుడుగా మారి కారు దిద్దిన కాపురం డైరక్ట్ చేసారు.

జనార్దన మహర్షి
ఎన్నో కామెడీ చిత్రాలు మాటలు, కథ అందించిన జనార్దన మహర్షి ...దర్శకుడుగా మారి చెంగల్వ పూదండ, గోపీ, దేవాలయం చిత్రాలను డైరక్ట్ చేసారు.

మదన్
ఆ నలుగురు తో రైటర్ గా పరిచయం అయిన మదన్ ...దర్శకుడుగా మారి పెళ్లైన కొత్తలో, గుండె జల్లు మంది, ప్రవరాఖ్యుడు, గరం సినిమాలు డైరక్ట్ చేసారు.